NewsSeva

నెల్లూరు జయభారత్ హాస్పిటల్ కి భారీ విరాళమందించిన దొడ్ల రుక్మిణమ్మ – వరదారెడ్డి ట్రస్ట్

182views

నెల్లూరు నగరంలోని జయభారత్ ఆసుపత్రికి చెన్నైకి చెందిన దొడ్ల రుక్మిణమ్మ – వరదారెడ్డి ట్రస్ట్ వారు రూ.17 లక్షలను విరాళంగా అందజేశారు. ఈ మొత్తానికి సంబంధించిన చెక్కును ఆసుపత్రి చైర్మన్ సీతారామి రెడ్డికి  మేనేజింగ్ ట్రస్టీ రఘునాథ రెడ్డి గురువారం అందజేశారు. ఈ సందర్భంగా సీతా రామిరెడ్డి మాట్లాడుతూ ఆధునిక వైద్య పరికరాల కోసం ఈ మొత్తాన్ని ట్రస్ట్ వారు జయభారత్ హాస్పిటల్ కి అందజేశారని తెలిపారు. మొబైల్ ఎక్స్ రే, ఐసీయూ వెంటిలేటర్, ఆపరేషన్ థియేటర్ లో మత్తు డాక్టర్ ఉపయోగించే పరికరాలను కొనుగోలు చేయనున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ శివ మౌర్య గుప్తా, ఆస్పత్రి ట్రస్టీ శ్రీ గుఱ్ఱం సుధాకర్, మేనేజర్ గురు ప్రసాద్ పాల్గొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.