News

సింహాచలం గిరి ప్రదక్షిణకు ముమ్మర ఏర్పాట్లు..

28views

విశాఖపట్నం: సింహాచలం శ్రీ వరాహలక్ష్మీనరసింహస్వామి గిరి ప్రదక్షిణ మహోత్సవానికి అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 28, 29 తేదీల్లో నిర్వహించనున్న గిరి ప్రదక్షిణను పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ శుక్రవారం క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పరిశీలించారు.

దేవస్థానం ఈవో జల్లేపల్లి వెంకట్రావుతో కలిసి 32 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ మార్గాన్ని తనిఖీ చేసిన కలెక్టర్, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

గిరి ప్రదక్షిణ సందర్భంగా భక్తుల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు. ట్రాఫిక్ నియంత్రణ, తాగునీటి సదుపాయం, తాత్కాలిక షెడ్లు, మొబైల్ టాయిలెట్లు, వైద్య శిబిరాలు, పారిశుధ్య నిర్వహణ వంటి అన్ని ఏర్పాట్లను వివిధ శాఖల సమన్వయంతో చేపడుతున్నట్లు దేవస్థానం ఈవో జల్లేపల్లి వెంకట్రావు వెల్లడించారు.

ఈ తనిఖీ కార్యక్రమంలో దేవస్థానం, గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ), పోలీసు శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.