
8views
సింధు జలాల్లో తమ వాటా ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ పాక్ మంత్రి ముసాదిక్ మాలిక్ చేసిన వ్యాఖ్యలపై భారత విదేశీ వ్యవహారాల శాఖ ఘాటుగా స్పందించింది. ఉగ్రవాదాన్ని ఎగదోయడం, ఉగ్ర కార్యకలాపాలను ప్రోత్సహించడం పాకిస్థాన్ మానుకొనే వరకు సింధు జలాల నిలిపివేత కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఈ విషయంలో భారత్ విధానం సుస్పష్టమని.. ఇందులో ఎలాంటి మార్పు ఉండబోదని తేల్చి చెప్పింది. రెండు దేశాల మధ్య స్నేహాన్ని, సుహృద్భావాన్ని పెంపొందించడానికి సిందు జలాల ఒప్పందం కుదిరిందని.. కానీ పాకిస్థాన్ దశాబ్దాలుగా ఉగ్రవాదానికి అండగా నిలుస్తూ ఆ సిద్ధాంతాలను ఉల్లంఘిస్తోందని విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి రణధీర్ జయస్‌వాల్ మండిపడ్డారు. అఫ్గానిస్థాన్‌పై పాక్ సైనిక దాడులను ఖండించారు.





