News

“విజయ్” పేరుతో లవ్ జీహాద్

41views

విజయ్ అనే పేరుతో యువతిని ప్రేమించిన ఓ ముస్లిం యువకుడు లవ్ జిహాద్ కు పాల్పడ్డాడు. పెళ్లి తర్వాత హిందు యువతిని మతం మారాలని ఇబ్బంది పెట్టడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఈ షాకింగ్ ఘటన మహారాష్ట్రలోని థానే జిల్లా ఉల్లాస్‌నగర్‌లో చోటు చేసుకుంది. యువతి ఫిర్యాదుతో తన అసలు గుర్తింపును దాచిపెట్టి, ఒక హిందూ యువతిని వంచించిన ముస్లిం యువకుడితో పాటు అతని ఇద్దరు సోదరులను సెంట్రల్ పోలీస్ స్టేషన్ అధికారులు అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఇమ్రాన్ షేక్ (33) అనే యువకుడు 2019లో ఒక గ్యారేజీలో పనిచేస్తున్న సమయంలో స్థానిక హిందూ యువతికి (27) ‘విజయ్’ అనే నకిలీ పేరుతో పరిచయమయ్యాడు. తనను తాను హిందువుగా పరిచయం చేసుకుని, ఆమెతో ప్రేమాయణం సాగించాడు. ఆ తర్వాత అదే ఏడాది ఆమెను బీహార్‌లోని తన స్వగ్రామానికి తీసుకెళ్లి, అక్కడ తన అసలు ముస్లిం గుర్తింపును బయటపెట్టి ఇస్లామిక్ పద్ధతిలో వివాహం చేసుకున్నాడు.

పెళ్లి తర్వాత ఉల్లాస్‌నగర్ తిరిగివచ్చిన సదరు యువతిని.. ఇమ్రాన్ షేక్, అతని కుటుంబ సభ్యులు తీవ్రంగా వేధించడం ప్రారంభించారు. హిందూ దేవుళ్లను పూజించవద్దని, ఇస్లాం మత ఆచారాలను పాటించడంతో పాటు బలవంతంగా బురఖా, హిజాబ్ ధరించాలని ఒత్తిడి తెచ్చారు. అంతటితో ఆగకుండా ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా గో మాంసం తినాలని వేధించారని, నిరాకరిస్తే శారీరకంగా, మానసికంగా హింసించారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. ఇటీవల ఇమ్రాన్ మరొక మహిళను వివాహం చేసుకోవడం, దీనిపై ప్రశ్నిస్తే తమ మతంలో బహుభార్యాత్వం అనుమతించ పడుతుందంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో బాధితురాలు తీవ్ర ఆవేదనకు గురై పోలీసులను ఆశ్రయించింది. యువతి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు.. ప్రధాన నిందితుడు ఇమ్రాన్ షేక్‌తో పాటు అతని సోదరులు సల్మాన్ షేక్, షాబాజ్ షేక్‌లను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు.