News

విభజనలో ఒక పొరపాటు చేసి ఉండకపోతే, ముస్లిములందరూ పాకిస్థాన్‌లో ఉండేవారు! – గిరిరాజ్ సింగ్

93views

విభజన సమయంలో మన పూర్వీకులు ఒక పెద్ద పొరపాటు చేశారు, ఆ మూల్యాన్ని ఈనాడు దేశం చెల్లించుకోవాల్సి వస్తోంది. 1947 నాటి విభజన సమయంలో, ముస్లిములందరూ పాకిస్తాన్‌కు వెళ్లిపోయి, హిందువులందరినీ భారతదేశానికి తీసుకువచ్చి ఉంటే, ఈనాటి పరిస్థితి తలెత్తేది కాదు. అసదుద్దీన్ ఒవైసీ వంటి రాజకీయ నాయకుడు ఈనాడు ఉండేవాడు కాదు అని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ బీహార్ లోని పూర్నియాలో జరిగిన సభలో వ్యాఖ్యానించారు.

పౌరసత్వ సవరణ చట్టం (CAA) పై జరుగుతున్న చర్చల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ చట్టానికి మద్దతుగా మాట్లాడుతూ, భారతదేశంలో నివసిస్తున్న ప్రజల పౌరసత్వ అంశంపై మంత్రి సింగ్ ఒక ప్రకటన చేశారు, అలాగే విభజన నాటి నిర్ణయాలను ప్రశ్నించారు.