
101views
అసెంబ్లీలో వందేమాతరం ఆలపించే సమయంలో ఎంఐఎం ఎమ్మెల్యేలు బయటకు వెళ్లడంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ దేశంలో ఉండేవారు ఎవరైనా జాతీయ గీతాన్ని గౌరవించి, వందేమాతరం పాడాల్సిందేనని స్పష్టం చేశారు. కరీంనగర్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బీజేపీ అధికారంలోకి వస్తే వందేమాతరం గానాన్ని తప్పనిసరి చేస్తుందని, ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎంఐఎం నేతల తీరును ఆయన తీవ్రంగా ఖండించారు.





