News

భారత్‌లో ఉగ్రవాద కార్యకలాపాలకు కుట్ర

115views

భారత్‌లో ఉగ్రవాద కార్యకలాపాలకు కుట్ర చేసినందుకు గతవారం ఒక అమెరికన్‌తోపాటు ఆరుగురు ఉక్రెయిన్‌ పౌరులను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అధికారులు అరెస్టు చేశారు. వారిపై కేసు నమోదు చేసిన ఎన్‌ఐఏ అధికారులు. పాటియాల హౌస్‌ కోర్టులో ప్రవేశ పెట్టగా తొలుత 3 రోజులు.. ఈ నెల 27 వరకూ జ్యుడిషియల్‌ రిమాండ్‌ విధిస్తూ న్యాయమూర్తి ప్రశాంత్‌ శర్మ ఆదేశాలు జారీ చేశారు. వారిపై చట్ట విరుద్ద కార్యకలాపాల నిరోధక చట్టంలోని 18వ సెక్షన్‌, ఇతర సెక్షన్ల ఆధారంగా కేసు నమోదైంది. మయన్మార్‌ మీదుగా మిజోరంలో అడుగు పెట్టిన అనుమానితుల వద్ద నిషేధిత ప్రాంతాల్లో పర్యటనకు అనుమతించే పత్రాలేమీ లేవు. అనుమానితుల వద్ద గల మొబైల్‌ ఫోన్ల డేటా విశ్లేషణ ఆధారంగా వారిపై కేసు నమోదు చేసినట్లు ఎన్‌ఐఏ తెలిపింది. వీరు భారత్‌ మీదుగా మయన్మార్‌కు డ్రోన్లలో ఆయుధాలు సరఫరా చేస్తున్నట్లు అభియోగాలున్నాయి. దీంతోపాటు భారత్‌లోని నిషేధిత తీవ్రవాద సంస్థలకు వారు ఆయుధాలు అందజేసి, శిక్షణ ఇచ్చినట్లు ఆధారాలు లభించాయి.