News

చెంచులకు ఉచిత స్పర్శదర్శనం

142views

  శ్రీశైల మల్లన్న ఉచిత స్పర్శదర్శనాన్ని శనివారం చెంచులకు కల్పించారు. సంప్రదాయబద్ధంగా తప్పెట వాయిద్యాలతో, నృత్యాలు చేస్తూ చెంచు భక్తులు దర్శనానికి వచ్చారు. ఉమారామలింగేశ్వరస్వామి ఆలయం వద్ద దేవస్థాన ఽఅధికారులు చెంచులకు ఆహ్వానం పలికారు. అనంతరం చెంచు భక్తులు ఆలయ ప్రాంగణంలో ప్రదక్షిణ చేశారు. చెంచులకు మల్లన్న స్పర్శదర్శనం, భ్రమరాంబాదేవి దర్శనం చేయించారు. అన్నప్రసాద వితరణ భవనంలో అన్నప్రసాదాలు సమర్పించారు. స్థానిక మేకలబండ, ఇతర గూడేలకు చెందిన చెంచు భక్తులు పాల్గొన్నారు.