
కాంగ్రెస్ పార్టీకి చెందిన విద్యార్థి విభాగం NSUI రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కి చెందిన ఎగ్జిబిషన్ హాలును ధ్వంసం చేసింది. అంతేకాకుండా నాన బీభత్సం సృష్టించింది. సంఘ కార్య శతాబ్ది సందర్భంగా ఈ నెల 23 న గుజరాత్ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో RSS@100 పేరుతో ఓ ఎగ్జిబిషన్ జరిగింది. ఈ సందర్భంగానే NSUI దాడికి దిగింది. అలాగే అంబేద్కర్, సర్దార్ పటేల్ పోస్టర్లను కూడా చింపేసి, విశ్వవిద్యాలయ ప్రదర్శనా స్థలంలో గందరగోళం సృష్టించారు.ఈ చర్యతో ఉన్నత విద్యా సంస్థలలో క్రమశిక్షణ, స్వేచ్ఛా వాతావరణంపై ఆందోళనలను రేకెత్తిస్తోంది.
దీనిని భారతీయ విచార మంచ్ తీవ్రంగా ఖండించింది. అది అత్యంత హేయమైన చర్య అని, ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. అంతేకాకుండా ఎగ్జిబిషన్ హాలులో ప్రదర్శనకు వుంచిన వాటిని ధ్వంసం చేయడం, కార్యక్రమానికి అంతరాయం కలిగించడం అంటే క్యాంపస్ నిబంధనలను ఉల్లంఘించడమే అని, ఇదంతా క్రిమినల్ చర్యల కిందికే వస్తుందని తెలిపింది.
విశ్వవిద్యాలయాలు జ్ఞానం, చర్చ మరియు మేధో మార్పిడి కేంద్రాలుగా వుండాలని సంకల్పం చేశారని, అంతేకానీ బెదిరింపుల అడ్డాగానో, విధ్వసంక కేంద్రాలుగా వుండాడానికో రూపించలేదని పేర్కొంది. భావ ప్రకటనా స్వేచ్ఛ పేరుతో ఇతరులను ఇబ్బందిపెట్టడం ప్రజాస్వామ్యం కాదని పేర్కొంది.
ఇక.. యూనివర్శిటీ అధికారులు కూడా అలర్ట్ అయ్యారు. వెంటనే సీసీ టీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అందులో దొరికే ఆధారాలను సేకరించి, బాధ్యులపై చర్యలు తీసుకోవడానికి రెడీ అవుతున్నారు.





