News

గోమయం నుంచి బయోప్లాస్టిక్

267views

పర్యావరణానికి పెనుముప్పుగా మారిన ప్లాస్టిక్ సమస్య పరిష్కారానికి ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని రామజస్ కళాశాల ముందడుగు వేసింది. పర్యావరణానికి సురక్షితమే కాకుండా, భవిష్య త్తులో ప్లాస్టికకు ప్రత్యామ్నాయంగా మారే సామర్థ్యమున్న బయో డిగ్రేడబుల్ ప్లాస్టిక్ ను ఆవు పేడ నుంచి ఈ కళాశాల అభివృద్ధి చేస్తోంది. కళాశాల ప్రొఫెసర్లు, పరిశోధకులు ఈ మేరకు కృషి చేస్తున్నారు.\

సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ ను నిర్మూలించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపే తమ పరిశోధనకు ప్రేరణ ఇచ్చిందని గోధన్ ల్యాబ్ ఇన్ ఛార్జ్, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ శుచీ వర్మ తెలిపారు. భారత్ లో సుమారు 21 కోట్ల పశువులు ఉన్నాయి. ఒక్కో ఆవు రోజుకు 7 నుంచి 15 కిలోల పేడను ఇస్తుంది. ఇందులో వ్యవసాయ అవసరాలకు కొంత పేడను వాడగా, మిగతా పెద్ద మొత్తంలో మిగిలిపోతుంది. ఈ పేడ ఆయా ప్రాంతాల్లో వృథాగా పడుండి, మిథేన్ వంటి విష వాయువులను విడుదల చేస్తోంది. గడ్డి, ఆకులు తినే పశువుల పేడలో సెల్యులోజ్ ఉంటుంది. దాని ఆధారంగా ఈ పేడ నుంచి బయోప్లాస్టిక్ అభివృద్ధి చేశారు. ఇది యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ ఉంటుందని.. ఆహార ప్యాకింగుకు సురక్షితమని శుచీ వర్మ పేర్కొన్నారు. పేటెంటు ప్రక్రియ చివరిదశలో ఉందని, పూర్తికాగానే వాణిజ్యపరంగా మార్కెట్ లోకి తీసుకొస్తామని చెప్పారు.