
22views
నాసిక్ లోని సింహస్థ కుంభామేళాలో దుకాణాల ఏర్పాటుపై మహారాష్ట్ర మంత్రి నితేష్ రాణే కీలక సూచనలు చేశారు. సింహస్థ కుంభమేళాలో హైందవేతరులు దుకాణాలు ఏర్పాటు చేసుకోవడానికి అనుమతులు ఇవ్వొద్దని డిమాండ్ చేశారు. కుంభమేళా అన్నది హిందువులకు అత్యంత పవిత్రమైనదని అన్నారు. హిందూ ధర్మంపై విశ్వాసం లేని వారెవ్వరు కూడా ఈ మేళా నుంచి ఏ రకమైన ప్రయోజనం పొందడానికి వీల్లేదన్నారు.
హైందవ ధర్మాన్ని విశ్వసించని వారెవ్వరికీ కూడా ఈ కుంభామేళాలో అస్సలు ఆతిథ్యం ఇవ్వొద్దని సూచించారు.ఈ విషయంలో హైందవ సమాజం మొత్తం అప్రమత్తంగా వుండాలని, హిందూ పేర్లతోనే దుకాణాలు ఏర్పాటు చేసి, వ్యాపారం చేసే ఇతర మతస్తుల విషయంలో అప్రమత్తంగా వుండాలని పిలుపునిచ్చారు. ‘‘ఈద్, ఇతర పండుగలు వచ్చినప్పుడు, ఇతరులు హిందువుల నుంచి ఏమీ కొనుగోలు చేయరు. ఎందుకంటే కాఫీర్లుగా భావిస్తారు’’ అంటూ రాణే పేర్కొన్నారు.





