
కేరళ హిందూదేవాలయాలలో ‘ఎర్ర’ బందిపోట్లు 3వ భాగం
కేరళ హిందూదేవాలయాలలో ‘ఎర్ర’ బందిపోట్లు 2వ భాగం
కేరళ హిందూదేవాలయాలలో ‘ఎర్ర’ బందిపోట్లు 1వ భాగం
తీర్పులే ఆసరాగా రెచ్చిపోయిన కామ్రేడ్లు
కేరళలో వరసగా రెండు పర్యాయాలు కమ్యూనిస్టు ప్రభుత్వం ఎన్నిక కావడం హిందూ ఆలయాలకు, ధర్మానికి పెద్ద ముప్పుగానే పరిగణించిందంటే అసత్యం కాదు. కొన్ని కొన్ని సమయాలలో కోర్టులు ఇచ్చిన తీర్పులు కూడా ఆలయ పవిత్రతకు భంగం వాటిల్లే విధంగానే ఉంది. భక్తుల మనోభావాలను, ఆలయ సంప్రదాయాలకు, విశ్వాసాలకు విలువ ఇవ్వకుండా కోర్టులు వ్యవహరించాయి. ఇది అత్యంత దురదృష్టకరం. అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశం గురించి సుప్రీంకోర్టు 2018లో హిందువులను తీవ్ర మనస్తాపానికి గురి చేస్తూ తీర్పు ఇచ్చింది.అది అయ్యప్ప ఆలయం సంప్రదాయానికి పూర్తిగా విరుద్ధమైనదని చెప్పడానికి ఎవరికీ సందేహం లేదు. రుతుస్రావం మొదలు కాని, లేదా ముగిసిన స్త్రీలకే అయ్యప్ప దర్శనానికి అనుమతి ఉంది. కాబట్టి అయ్యప్ప దర్శనం స్త్రీలకు లేనేలేదని చెప్పడం, దానిని వివక్షగా చిత్రించడం శుద్ధ అబద్ధం. కానీ అన్ని వయసుల వారిని ప్రవేశపెట్టవలసిందేనని సమాన హక్కు పేరుతో సుప్రీంకోర్టు ఆదేశించింది. నిజానికి ఇప్పటికీ మసీదులలో స్త్రీలకు ప్రవేశం లేదు. కానీ దాని గురించి ఏ మహిళా సంఘం ఇంతవరకు కోర్టుకు వెళ్లలేదు. ముస్లిం మహిళల సమాన హక్కు కోసం ఏ కోర్టూ సుమొటొగా తీసుకోనూలేదు. సుప్రీం కోర్టు ఆదేశాలను కమ్యూనిస్టు ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆగమేఘాల మీద అమలు చేశాడు. ఆ వ్యాజ్యం వేసినదే హిందూత్వానికి ఎలాంటి సంబంధం లేని, నీతి నియమాలు లేని, సెక్యులరిస్టులమని చెప్పుకునే కొందరు స్త్రీలు. ఇంకా చెప్పాలంటే అమ్ముడుపోయిన మేధావులు. అయితే కోర్టు ఆదేశం తరువాత ఆ వ్యాజ్యం నడిపిన వారిలో చాలామంది అసలు అయ్యప్ప దర్శనానికి రాలేదు. కానీ ముగ్గురు కరుడగట్టిన హిందూ వ్యతిరేకులైన మహిళలను పినరయి విజయన్ ప్రభుత్వం ఏరుకొచ్చి మరీ లోపలికి ప్రవేశపెట్టదలిచింది. పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తుతో ఆ పనిచేసింది కూడా. కనకదుర్గ, రహన్ ఫాతిమా, బిందు అమ్మాణి అనే ఆ ముగ్గురుని పవిత్ర అయ్యప్ప గుడిలోకి తీసుకువెళ్లే ముందు ఓ అతిథిగృహంలో పెట్టి గొడ్డుమాంసం, పరాటాలతో మేపారు. ఆ తరువాతే గుడిలోకి (సన్నిధానం) తీసుకువెళ్లారు. ఈ సంగతి కొందరు ప్రముఖులు పోలీసులు ఇచ్చిన సమాచారంతోనే ఇటీవల బయట పెట్టారు. కాగా, హిందూ ద్వేషులను ఆచారానికి విరుద్ధంగా గుడిలోకి ప్రవేశపెట్టాలని ఉవ్విళ్లూరిన ప్రభుత్వం సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులను రద్దీ పేరుతో తిప్పి పంపడం, మెడలోని రుద్రాక్షలను తొలగించమని ఆదేశించడం వంటి నీచమైన పనులు చేయడానికి మాత్రం చాలా సందర్భాలలో వెనకాడడం లేదని విమర్శలు ఉన్నాయి.
హిందూ ద్వేషులైన మహిళల ప్రవేశాన్ని హిందూ సంఘాల వారు తీవ్రంగా వ్యతిరేకించారు. వీరిలో స్త్రీలు కూడా ఎక్కువే. అయితే మహిళలు అని కూడా చూడకుండా పినరయి విజయన్ పశుబలం ప్రదర్శించి, తనలోని ఎర్రపశువును లోకానికి ప్రదర్శించారు. అప్పుడు కేరళ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్న కె. సుధాకరన్ పినరయి చర్యకు నిరసనగా ఆమరణ దీక్ష చేపడతానని హెచ్చరించారు. కానీ ఢల్లీిలోని టెన్త్ జనపథ్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఆయన వెనక్కి తగ్గిపోయారని చెబుతారు. ఈ కాంగ్రెస్ ఇప్పుడు బంగారం దొంగతనం గురించి ఘోషిస్తున్న అయ్యప్ప భక్తులకు మద్దతు అంటూ బయలు దేరింది. మద్దతు ఇవ్వవచ్చు. కానీ సనాతన ధర్మం వంటి మాటలు ఏ సభలలోను వినిపించరాదని టెన్త్ జనపథ్ నుంచి ఆదేశాలు మళ్లీ వచ్చాయని కూడా చెబుతున్నారు.





