News

గిరిజన ఆరోగ్యంలో సంప్రదాయ వైద్యం కీలకం

21views

‘ఆంధ్రప్రదేశ్‌ గిరిజన సంప్రదాయ వైద్యం – వైద్య పద్ధతులు’అనే అంశంపై రుషికొండలోని గిరిజన సాంస్కృతిక పరిశోధన, శిక్షణ మిషన్‌ భవన్‌(టీసీఆర్‌టీఎం)లో వర్క్‌షాపు నిర్వహించారు. బిర్సా ముండా 150వ జయంతి ఉత్సవాల్లో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో టీసీఆర్‌టీఎం ఈడీ డా. రాణి మందా మాట్లాడారు. సంప్రదాయ వైద్య పరిజ్ఞానాన్ని భవిష్యత్‌ తరాలకు అందించేందుకు ఇలాంటి వర్క్‌షాప్‌లు ఉపయోగపడతాయన్నారు. గిరిజన సమాజ ఆరోగ్యాన్ని నిలబెట్టడంలో సంప్రదాయ వైద్య పాత్రను ఆమె గుర్తు చేశారు. ఈ సందర్భంగా క్యాన్సర్‌ చికిత్సలో విశేష సేవలందించిన డా. వైద్య నారాయణ మూర్తిని స్మరించుకున్నారు. కార్యక్రమంలో ప్రొఫెసర్‌ అనీల్‌ కుమార్‌, నాగరాజు చిక్కాల తదితరులు పాల్గొన్నారు