
43views
ఉత్తర్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్ లో తీసుకొచ్చిన మతమార్పిళ్ల నిరోధక చట్టాలను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లను హిందూ మత సంస్థ అఖిల భారతీయ సంత్ సమితి సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. వివిధ రాష్ట్రాల్లో దాఖలైన పిటిషన్లు అన్నింటికీ సుప్రీంకోర్టు గత సెప్టెంబరులో తన వద్దకు బదిలీ చేసుకుంది. ఈ వ్యవహారంలో తమ వాదనలూ వినాలని అఖిల భారతీయ సంత్ సమితి కోరుతూ సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ వేసింది.





