News

పూజలు చేసుకుంటాం అన్నందుకు 20 మంది హిందూ మహిళలపై కేసు

50views

ఉత్తరప్రదేశ్ లోని ఫతేహ్ పుర్ లో శతాబ్దాల నాటి నవాబ్ అబు సమద్ ఖాన్ సమాధి ముందు పూజలు నిర్వహించిన 20 మంది మహిళలపై కేసు నమోదైంది. నిషేధం ఉన్నా…. లెక్కచేయకుండా కంచె దూకి సమాధి కట్టడంలోనికి ప్రవేశించేందుకు యత్నించడంతో స్థానిక నాయకుడు పప్పు సింగ్ భార్య సహా 20 మంది గుర్తుతెలియని మహిళలపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నందుకు మహిళలు తమతో వాగ్వాదానికి దిగారాని… అనంతరం సమాధి ముందు పూజలు నిర్వహించారనివివరించారు.

అయితే… గతంలో ఈ ప్రాంతంలో ‘ఠాకూర్జీ’ ‘శివలింగం’ ఉన్న ఆలయం ఉండేదని, దీనిని కూల్చి నవాబ్ ఖాన్ సమాధి నిర్మించారంటూ ఆగస్టు 11న స్థానికంగా అల్లర్లు మొదలయ్యాయి. ఇక్కడ తమకు పూజలు నిర్వహించే అనుమతి ఇవ్వాలంటూ డిమాండ్లు చేశారు. ఈ నిర్మాణాన్ని కూల్చేందుకు యత్నించారు . దీంతో వెంటనే అధికారులు సమాధి పరిసరాలను మూసివేసి చుట్టూ కంచె నిర్మించారు. నిషేధాజ్ఞలు జారీ చేశారు. బుధవారం కార్తిక పౌర్ణమిని పురస్కరించుకుని పలువురు మహిళలు కంచె దూకి లోపలికి ప్రవేశించేందుకు యత్నిస్తుండగా పోలీసులు వారిని అడ్డుకుని కేసు నమోదు చేశారు.