News

రాష్ట్రవ్యాప్తంగా “వందేమాతరం” సామూహిక గీతాలాపన కార్యక్రమం

52views

“వందేమాతరం” 150 సంవత్సరాన్ని పురస్కరించుకొని రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలలో సామూహిక గీతాలాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా తిరుపతి, గుంటూరు, పార్వతీపురంమన్యం, అనంతపురం, ఎన్టీఆర్, ప్రకాశం, కృష్ణా జిల్లాలలో నిర్వహించిన కార్యక్రమాలలో కలెక్టర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొని వందేమాతర గీతాన్ని ఆలపించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు మాట్లాడుతూ, వందేమాతరం గీతంను స్వర్గీయ బంకిం చంద్ర ఛటర్జీ రచించిన వందేమాతర గీతాన్ని 1875లో భారత దేశ జాతీయ గేయంగా గుర్తించబడిందని, దేశ స్వాతంత్ర్యం కోసం జరిగిన పోరాటంలో చూపించిన స్ఫూర్తిని, త్యాగాన్ని గుర్తు చేస్తుందని, గతంలో ప్రజలలో చైతన్యానికి పాటల రూపంలో ఆటల రూపంలో ప్రజలలో చైతన్యాన్ని నింపడానికి ఎంతో ఉపయోగపడేదని, ఈ వందేమాతర గీతం భారతదేశంలో నివసించే అన్ని కులాలు మతాలు భాషలు ప్రాంతాలలో నివసించే ప్రజలలో స్వాతంత్ర్య సంపాదించడానికి ప్రజలను ఏకతాటిపై తేవడానికి ఈ వందేమాతర గీతం ఎంతో స్ఫూర్తిప్రదాయంగా నిలిచిందని తెలిపారు