News

‘‘ఖాన్‌’’ను ముంబై మేయర్‌గా అనుమతించం..

56views

అమెరికా న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో జోహ్రాన్ మమ్దానీ (34) ఘన విజయం సాధించారు. న్యూయార్క్‌కు కాబోతున్న మొదటి ముస్లిం మేయర్‌గా మమ్దానీ ఎనిక్కైయ్యారు . దీని తర్వాత, ముంబై బీజేపీ చీఫ్ అమీత్ సతం సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ మేము ఏ ఖాన్‌ను ముంబై మేయర్‌గా అనుమతించం’’ అని అన్నారు. ఓట్ జిహాద్ ద్వారా న్యూ్యార్క్ నగరంలో కనిపించే విధంగా ముంబైకి రాజకీయాలు తీసుకురావడానికి ప్రయత్నం జరుగుతోందని అన్నారు.

కొంత మంది నాయకులు అధికారాన్ని నిలబెట్టుకోవడానికి బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్నారని, గతంలో సమాజాన్ని విభజించడానికి ప్రయత్నించిన ఇలాంటి శక్తుల నుంచి ముంబైని రక్షించడం అవసరమని అన్నారు. తాము మత సామరస్యాన్ని నమ్ముతామని, కానీ ఎవరైనా దేశ వ్యతిరేఖ వైఖరిని అవలంభించడం ద్వారా సమాజాన్ని విభజించడానికి ప్రయత్నిస్తే వ్యతిరేకిస్తామని అన్నారు.

భారతీయ సంతతికి చెందిన మమ్దానీ న్యూయార్క్ ఎన్నికల్లో డెమొక్రాట్ అభ్యర్థిగా బరిలోకి దిగి గెలుపొందారు. 8.4 మిలియన్ల జనాభా ఉన్న అమెరికన్ నగరాన్ని ఈయన నడిపించబోతున్నారు. ఉచిత ట్రాన్స్‌పోర్ట్ సేవలు, ఉచిత పిల్లల సంరక్షణ వంటి హామీలతో గెలిచారు. అధికార రిపబ్లికన్ పార్టీకి, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మమ్దానీ విజయం ఒక షాక్‌గా ఉంది.