News

సంఘమిత్ర ఆవాసంలో ఉత్సాహంగా కోజాగిరి ఉత్సవం

109views

నంద్యాల జిల్లా, సంఘమిత్ర ఆవాసంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా కార్యవర్గ సభ్యుల కుటుంబాలతో కలిసి సంఘమిత్ర చిన్నారులు కోజాగిరి ఉత్సవాన్ని ఉల్లాసంగా జరుపుకున్నారు‌.

ఆశ్రమ వాతావరణంలో కుటుంబ ఆత్మీయ వాతావరణాన్ని సంఘమిత్ర చిన్నారులకు పరిచయం చేయుటకు, అమ్మ చేతి గోరుముద్ద, దీపావళి, నవరాత్రి బొమ్మల కొలువు, కోజాగిరి ఉత్సవం, కార్తీక వనభోజనాలు లాంటి సాంప్రదాయ కార్యక్రమాలు నిర్వహించటం ఆనవాయితీ.

ఈ ఉత్సవంలో సంఘమిత్ర కార్యవర్గ సభ్యులు, కుటుంబాలతో సహా పాల్గోన్నారు. ఈ సందర్భంగా చిన్నారులతో పండు వెన్నెల్లో ఆడిపాడి, అమృతం కురిసిన పాలను సేవించి ఎనలేని ఆనందాన్ని, ఆరోగ్యాన్ని పొందారు.

సదరు కార్యక్రమంలో సంఘమిత్ర అధ్యక్షులు శ్రీ చిలుకూరి శ్రీనివాసరావు, సంఘమిత్ర ఉపాధ్యక్షులు శ్రీ జీనపల్లి వెంకటేశ్వర్లు, సంఘమిత్ర కోశాధికారి శ్రీ సముద్రాల నాగరాజయ్య, సంఘమిత్ర సంఘటనా కార్యదర్శి శ్రీమతి విజయశ్రీ, సంఘమిత్ర సభ్యులు శ్రీమతి వెంకటేశ్వరి, శ్రీ మోదాల రామాంజనేయులు, సేవా భారతి జిల్లా సేవా ప్రముఖ శ్రీ సంఘ శ్రీనివాసులు వారి వారి కుటుంబాలతో సహా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది.