
62views
అనంతపురం జిల్లా నార్పల మండల కేంద్రంలోని మారెమ్మ ఆలయంలో అపచారం జరిగింది. మందుబాబులు మారెమ్మ ఆలయ తాళం పగులగొట్టి, గుడిలోకి వెళ్లి మారెమ్మ విగ్రహం ముక్కును ధ్వంసం చేశారు. అక్కడే మద్యం సేవించారు. వస్తువులు చెల్లాచెదురుగా పడేశారు. అనంతరం హుండీని ఎత్తుకెళ్లారు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ సాగర్ మారెమ్మ గుడిని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని, నిందితులను పట్టుకుంటామని తెలిపారు.





