
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తన సతీమణి ఉషా వాన్స్ మతం మార్చుకునే విషయంపై చేసిన వ్యాఖ్యలు ఇటీవల తీవ్ర చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. వాన్స్ వ్యాఖ్యలను భారతీయ- అమెరికన్ అయిన కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి తీవ్రంగా ఖండించారు. ఉపాధ్యక్షుడి వ్యాఖ్యలు అమెరికాలో హిందూ వ్యతిరేకతను మరింత ఎగదోస్తున్నాయన్నారు.
ఈ మేరకు కృష్ణమూర్తి ఎక్స్‌లో ఓ పోస్టు పెట్టారు. అమెరికాలో భారతీయ- అమెరికన్లపై పెరుగుతున్న పక్షపాతం, సామూహిక బహిష్కరణల గురించి ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. హిందూ వ్యతిరేక భావాలు పెరుగుతున్న సమయంలో సొంత పార్టీ సభ్యుడైనా కూడా.. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చేసిన వ్యాఖ్యలు తనను తీవ్ర నిరాశ పరిచాయన్నారు. వాన్స్ వ్యాఖ్యలు ఆ వ్యతిరేకతకు ఆజ్యం పోసినట్లుగా ఉందన్నారు. ఉషా వాన్స్ భారతీయ అమెరికన్. ఇటీవల జేడీ వాన్స్ ఓ యూనివర్సిటీలో మాట్లాడుతూ ఉషా మతం విషయంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఉష ఏదోరోజు క్రైస్తవంలోకి మారుతుందని తాను ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో వాన్స్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ వ్యతిరేకతపై కూడా ఉపాధ్యక్షుడు స్పందించారు. ఉషా క్రిస్టియన్ కాదని, మతం మారే అవకాశం లేదని స్పష్టం చేశారు.





