
ప్రస్తుతం, భారతీయ సమాజంలో మహిళల స్థానంగురించి కూడా భ్రమలు సృష్టించి, మరోవిధంగా భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకోవడం జరుగుతుంది. భారతదేశంలో మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయని, వారికి హక్కులు లభించడం లేదని, వారు నిరంతరం బాధితులుగా ఉంటున్నారని పదేపదే ప్రచారం చేయబడుతోంది. ఈ విషయం పూర్తిగా నిరాధారమైనది కాదని, చరిత్రలో కొన్ని సామాజిక దురాచారాలు వచ్చాయని, కొన్ని వికృతులు ఉత్పన్నమయ్యాయని, దానివల్ల మహిళలు నష్టపోవలసి వచ్చిందని మనం అంగీకరిస్తాము.
కానీ, ఈ వికృతులను రూపుమాపడానికి తీవ్రమైన గళం సమాజం నుండే వినిపించిందనేది కూడా అంతే సత్యం. అయితే పరిస్థితి పూర్తిగా మారలేదు. కానీ ఈ నిరంతర ప్రయత్నాల ఫలితంగా నేడు సమాజంలో ఒక చైతన్యం వచ్చింది. భారతదేశం తన కౌటుంబిక, సాంస్కృతిక చట్రంలోనే ఈ సమస్యలకు పరిష్కారం కనుగొనడం ద్వారా తన సామర్థ్యాన్ని నిరూపించుకుంటుంది.
నేడు సేవ, సామాజిక, సాంస్కృతిక కార్యాలతోపాటు విద్య, పరిపాలన, విజ్ఞానం, రక్షణ, పరిశ్రమలు, వాణిజ్యం వంటి రంగాలలో కూడా మహిళలు నిరంతరం ముందుకు వస్తున్నారు. అలాగే వారు నాయకత్వంలోని అనేక ముఖ్యమైన స్థానాలలో స్థిరపడి, తమ కార్య సామర్థ్యం, దక్షతల ద్వారా ప్రభావవంతమైన పాత్ర పోషిస్తున్నారనేది సంతోషకరమైన విషయం.
ఈ మార్పును చూసినప్పుడు, భారతదేశంలో మహిళలను కేవలం సానుభూతి పాత్రులుగా పరిగణించకుండా, భాగస్వామ్యానికి, నాయకత్వానికి సహజ అధికారులుగా కూడా భావిస్తున్నారని స్పష్టమవుతుంది. అయితే కొన్ని శక్తులు నేటికీ పాశ్చాత్య భావజాలాలు ప్రకారం మహిళలు, పురుషులను ఒకరికొకరు వ్యతిరేకంగా నిలబెట్టడానికి ప్రయత్నిస్తున్నాయి. అవి పురుషులను సమాజంలో ‘విలన్’గా, మహిళలను ‘బాధితులు’గా చిత్రీకరిస్తున్నాయి. ఈ చిత్రణతో సమాజ సహజ అల్లికను విచ్చిన్నంచేసే ప్రయత్నం జరుగుతోంది.
మన విశ్వాసం ఏమిటంటే –
పురుషులు, మహిళలు ఒకరికొకరు పూరకాలు. ప్రత్యర్థులు కాదు. ప్రకృతియే అలా సృష్టించింది.కుటుంబం, సమాజం. దేశం మూడింటి విజయం ఇరువురి సమాన భాగస్వామ్యం పైన, పరస్పర గౌరవం పైన ఆధారపడి ఉంటుంది.
మనం పాశ్చాత్యులను గుడ్డిగా అనుకరించకూడదు. అట్లే, మన సమస్యలను, లోపాలను కూడా తిరస్కరించకూడదు. మన హిందూ కుటుంబ దృక్పథం ప్రకారం, సమరసత ద్వారా, సానుకూల చర్చల ద్వారా ఆచరణాత్మక పరిష్కారాలను కనుగొనాలి.
పరిష్కారం మన మూలాల్లోనే
సమాజంలో మహిళల సాధికారత కోసం చేసే దృఢమైన ప్రయత్నాలే విశ్వాసాన్ని కలిగిస్తాయి; కేవలం ప్రసంగాలు, ప్రచారాలు, నినాదాలు కాదు. మన జీవితంలో ఆచరించబడే సానుకూల చర్యలు – ఉదాహరణకు
మొదలగు ఈ ప్రయత్నాలే మన సామాజిక సమస్యలకు నిజమైన పరిష్కారంగా మారతాయి. ఈ విధంగా, మనం మన విలువలు, జీవనదృష్టి ప్రకారం నడిచినప్పుడే, మనం ఒక ఆరోగ్యకరమైన కుటుంబం, ఆరోగ్యకరమైన సమాజం, ఆరోగ్యకరమైన దేశం దిశగా పురోగమిస్తాము.
 
			




