ArticlesNews

సంస్కృతి భారం కాదు, జీవనపద్ధతి

47views

నేటి మారుతున్న ప్రపంచంలో సాంకేతికత, మార్కెట్ నిరంతరం కొత్త రూపాలలో మన జీవితంలోకి ప్రవేశిస్తున్న వేళ మనం మన జీవన విలువలు, కుటుంబ సంబంధాలు, సాంస్కృతిక సంప్రదాయాలను తర్వాతి తరానికి పూర్తి అవగాహన, శ్రద్ధతో అందించడం కూడా అవసరం. ఈ కార్యం సామూహిక ప్రయత్నంతోనే సాధ్యం, దానికి కేంద్రం మన ఆనందకరమైన, సమతుల్యమైన, గౌరవప్రదమైన గృహస్థ జీవితం. రాబోయే కాలంలో ఏవైనా కొత్త ప్రచారాలు, భావజాలాలు లేదా సామాజిక తుఫానులు వచ్చినప్పుడు, వాటికి సమాధానం కేవలం తర్కంతో కాదు, మన ఆచరణ, శ్రద్ధ, సంస్కృతి ఆధారంగానే ఇవ్వగలం.

మనం చేయాల్సింది
సంస్కృతిని భారంగా కాకుండా. జీవనపద్ధతిగా అర్థం చేసుకోవడం, దానిని జీవితాంతం ఆధునిక సందర్భాలలో మన ప్రవర్తనలోకి తీసుకురావడం. భారతదేశానికి ఇది కేవలం ఒక సాంస్కృతిక బాధ్యతే కాదు, ఒక జాతీయ కార్యం కూడా.

దేశ-ధర్మ జాగృతి కేవలం భారతదేశానికే కాదు, యావత్ ప్రపంచానికి ఉపయోగకరము. నేటి ఇంటర్నెట్ యుగంలో, సమాచారం వేగంగా వ్యాపిస్తున్నప్పుడు, ధర్మం యొక్క వాస్తవ అవగాహన, దేశ-ధర్మ చైతన్య వ్యాప్తి అత్యంత అవసరం. ధర్మం అంటే కేవలం పూజాపద్దతి కాదు, అది జీవితాన్ని సమతుల్యంగా, సానుకూలంగా, సర్వజన హితంగా మార్చే మార్గం. ప్రపంచంలో మతం (Religion) పేరుతో హింస, ఉగ్రవాదం, సంఘర్షణలు జరుగుతుండగా, భారతదేశ జీవనదృష్టి, ధర్మాన్ని సద్భావన, శాంతి, మరియు ‘సర్వే భవంతు సుఖినః’ అనే భావనగా చూస్తుంది.

ఈ దృక్పథాన్ని ప్రపంచం ముందు ప్రస్తుతించడం నేటి ధర్మం. హిందువు తన ఆదర్శాలు, జీవన-విలువలకు అనుగుణంగా నడవడం, కేవలం భారతదేశానికే కాదు, యావత్ ప్రపంచానికి ఉపయోగపడగలదు.