NewsSeva

తుపాను బాధిత ప్రాంతంలో స్వయంసేవకుల సహాయక చర్యలు

47views

రాష్ట్రాన్ని వణికించిన మొందా తుపాను ప్రభావంపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ – ఆర్ఎస్ఎస్ స్వయంసేవకులు స్పందించి సహాయకచర్యల్లో పాల్గొన్నారు. కాకినాడ జిల్లాలోని పిఠాపురం, U.కొత్తపల్లి మండలం ప్రాంతాల్లో తుపాను తీవ్ర ప్రభావం చూపించింది.నాగులాపల్లి రామనక్కపేట రోడ్ ప్రాంతాల్లో సహాయక చర్యల్లో స్వయంసేవకులు పాల్గొని రహదారులు క్లియర్ చేసారు; పడిపోయిన చెట్లు, విద్యుత్ స్తంభాలను తొలగించారు. ఇంకా వరద ప్రభావిత ప్రాంతాల్లో స్వచ్ఛతా కార్యక్రమాలు చేపట్టారు.

అలాగే రహదారుల మీద విరిగిపడిన చెట్లను, కరెంటు స్తంభాలను తొలగించారు. రహదారులకి ఇరువైపులా అడ్డంగా ఉన్నటువంటి చెట్లను తొలగించారు. ఈ కార్యక్రమాలలో పెద్ద సంఖ్యలో స్వయంసేవకులు, సేవా భారతి కార్యకర్తలు పాల్గొన్నారు.