News

నమస్తే కాదు.. సలాం అలైకుం చెప్పండి.. విదేశీయునితో ముస్లిం వాదన

83views

దీపావళి సందర్భంగా దీపావళి శుభాకాంక్షలు తెలిపినందుకుగానూ, మీరు నమస్తే కాదు సలాంఅలైకుమ్ అని చెప్పండి ఇది మహ్మదీయ వీధి అంటూ ఓ ముస్లిం వ్యక్తి ఇక విదేశీ వ్లాగర్ తో చెప్పాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.. ఓల్డ్ ఢిల్లీలోని ముస్లిం వీధిలో న్యూజిలాండ్ కు చెందిన ఒక విదేశీ పర్యాటకుడు, రెస్టారెంట్ నుండి బయటకు వస్తూ, అక్కడ ఉండే వ్యక్తులకు దీపావళి సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ నమస్తే చెప్పాడు. అయితే అక్కడే ఉన్న ముస్లిం వ్యక్తి మీరు నమస్తే బదులుగా సలాం అలైకుమ్ అని అనాలని ఇది ముస్లింల వీధి అంటూ చెప్పడం, తర్వాత ఆ విదేశీ వ్లాగర్ అలాగే చెప్పి వెళ్లడం ఆ వీడియోలో మనం చూడొచ్చు. ఆతర్వాత ఆ వ్లాగర్ పోస్టు చేసిన వీడియో కొద్ది క్షణాల్లోనే ఇంటర్నెట్ లో వైరల్ గా మారిపోయింది. నెటిజన్లలో మతపరమైన చర్చలకు దారితీసింది.

అందిరతో మంచిగా ఉండటానికి ప్రయత్నిస్తున్న ఒక విదేశీయుడిని అసమంజసంగా ఇలా అనాలి, అలా అనాలి అని చెప్పడం ఏంటని కొంతమంది విమర్శించగా…దీపావళి సందర్భంగా శుభాకాంక్షలు చెబితే మాకు ఇలా చెప్పాలి అని అనడం ఏంటి, కొంతమంది కొంచం ప్రకాశాన్ని కూడా భరించలేరు అని ఇంకో నెటిజన్ అన్నాడు. ఇక మరొకరు”సలాం అలైకుమ్” అని చెప్పడం సమస్య కాదు, కానీ “నమస్తే” అని చెప్పడాన్ని అతను వ్యతిరేకించిన విధానం చూస్తే అతనికి చికిత్స అవసరమని చూపిస్తుంది. అతన్ని పట్టుకుని ప్రేమతో లేదా బలవంతంగా వివరించాలి, ఎందుకంటే అతను ఎన్నటికీ దీన్ని అర్థం చేసుకోలేడు” అని మరొక నెటిజన్ వ్యాఖ్యానించారు.