
32views
క్రైస్తవుల అక్రమ మత మార్పిళ్లు, ప్రలోభాలకు దేశ వ్యాప్తంగా హిందువులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడికక్కడ వారి ప్రలోభాలను తుంచేస్తూ… పోరాటాలు చేస్తున్నారు. వెంటనే… తమ ప్రాంతాల్లో అక్రమ మత మార్పిడి నిరోధక బిల్లును అమలు చేయాలంటూ డిమాండ్లు చేస్తున్నారు. ఇదే డిమాండ్ తో వేల మందితో ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా అరుణాచల్ ప్రదేశ్ లో 1000 మందితో భారీ నిరసన జరిగింది. దీంతో పాటు ఈ యేడాదే పలు ప్రాంతాల్లో కూడా అక్రమ మత మార్పిళ్లకు వ్యతిరేకంగా హిందువులు నిరసన చేపట్టారు. వాటికి సంబంధించిన కొన్ని వివరాలు…
అరుణాచల్ ప్రదేశ్ లోని హిందువులు అక్రమ మత మార్పిళ్లకి వ్యతిరేకంగా భారీ నిరసనలు చేపట్టారు. వెంటనే అరుణాచల్ ప్రదేశ్ లో మత మార్పిడి నిరోధక చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ భారీ ర్యాలీ చేపట్టారు. రాష్ట్రంలో 46 ఏళ్ల నాటి మత మార్పిడి నిరోధక చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాజధాని ఈటానగర్ లో భారీ ర్యాలీ జరిగింది. వేలాది మంది స్థానిక హిందువులు ఇందులో పాల్గొన్నారు. క్రైస్తవ మిషనరీలు అక్రమ మత మార్పిళ్లు చేస్తూ రెచ్చిపోతున్నారని, వెంటనే వారికి చట్టాలతో అడ్డుకట్ట వేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
1978 నాటి అరుణాచల్ ప్రదేశ్ మత స్వేచ్ఛా చట్టాన్ని వెంటనే అమలు చేయాలని నిరసనకారులు డిమాండ్ చేశారు.ఈ ర్యాలీని ఇండిజీనస్ బిలీవ్స్ & కల్చరల్ సొసైటీ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ (IFCSAP) నిర్వహించింది. అరుణాచల్ ప్రదేశ్‌లోని 26 జిల్లాల్లోని 27 తెగలు మరియు 100 కి పైగా ఉప తెగల నుండి వేలాది మంది స్థానిక ప్రజలు నిరసన ర్యాలీలో పాల్గొన్నారు.డోని-పోలో’ నమ్మకాల వ్యవస్థతో సహా రాష్ట్రంలోని స్థానిక విశ్వాసాలను కాపాడాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు.

డోని-పోలో వ్యవస్థ రాష్ట్రంలో లక్షలాది మంది ప్రజలు అనుసరించే పురాతన నమ్మక వ్యవస్థలలో ఒకటి, ఇక్కడ డోని సూర్యుడిని మరియు పోలో చంద్రుడిని సూచిస్తుంది.
1978 లో అసెంబ్లీలో మత మార్పిడి నిరోధక బిల్లును ప్రవేశపెట్టారని, అప్పటి నుంచి 46 ఏళ్ల పాటు అది నిష్క్రియాపర్వంలో వుందని, దానిని వెంటనే అమలు చేయడమే తమ ర్యాలీ లక్ష్యమని తెలిపారు.ఈ చట్టం రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టబడిన వెంటనే రాష్ట్రపతి ఆమోదం పొందింది, కానీ వరుసగా వచ్చిన ప్రభుత్వాలు రాష్ట్రంలో దీనిని ఎప్పుడూ అమలు చేయలేదని మండిపడుతున్నారు. ఈ అలసత్వంతో మత మార్పిళ్లకు అడ్డుకట్ట లేకుండా పోతోందన్నారు.ఈ చట్టాన్ని రాష్ట్రంలో సరిగ్గా అమలు చేస్తే, స్థానిక ప్రజలు వేల సంవత్సరాలుగా ఆచరిస్తున్న సంస్కృతి, ఆచారాలు మరియు సంప్రదాయాలను పరిరక్షించుకోగలమని అంటున్నారు.
ఈ ర్యాలీని, డిమాండ్ ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న అరుణాచల్ క్రిస్టియన్ ఫోరం…
మరో వైపు హిందువులు చేస్తున్న ఈ ర్యాలీని అరుణాచల్ క్రిస్టియన్ ఫోరం వ్యతిరేకించింది. దీనికి వ్యతిరేకంగా ప్రజాభిప్రాయ సేకరణ చేస్తోంది. తాము ఎవ్వరిపై బలవంతపు మత మార్పిళ్లు చేయడం లేదని, హక్కుల ప్రకారమే నడుచుకుంటున్నామని శుద్ధ అబద్ధాలు ఆడుతున్నారు. సెప్టెంబర్ 2024లో, గౌహతి హైకోర్టు అక్టోబర్ 25 నాటికి APFRA అమలు చేయడానికి ముసాయిదా నియమాన్ని ఖరారు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.హైకోర్టు ఆదేశాలు ఇప్పుడు ఈ చట్టం అమలుకు కట్టుబడి ఉన్నాయని రాష్ట్ర బిజెపి ప్రభుత్వం వాదిస్తోంది.
1978 అక్రమ మత మార్పిడి చట్టంలో ఏముంది?…
అరుణాచల్ ప్రదేశ్ మత స్వేచ్ఛ చట్టం, 1978 బలవంతపు మత మార్పిడులను నిషేధిస్తుంది. ఈ చట్టం ద్వారా బలవంతంగా, మోసపూరితంగా లేదా ప్రలోభపెట్టడం ద్వారా మత మార్పిడులను నిరోధిస్తుంది.
బలవంతంగా, ప్రలోభపెట్టి లేదా మోసపూరిత మార్గాల ద్వారా ఒక మతం నుండి మరొక మతంలోకి మారడాన్ని నిషేధించడం ఈ చట్టం ఉద్దేశం.
ఈ చట్టం ప్రకారం, మత మార్పిడికి గురవుతున్న వ్యక్తి మరియు మత మార్చిన వ్యక్తి జిల్లా మేజిస్ట్రేట్ ముందు ఒక ప్రకటన చేయాలి.
ప్రకృతి ఆరాధన: ముఖ్యంగా డోన్యి-పోలో (అంటే “సూర్యుడు మరియు చంద్రుడు”) ఆరాధనను రాష్ట్రంలోని అనేక వర్గాలు ఆచరిస్తాయి.
డోన్యి-పోలో అనేది ఈశాన్య భారతదేశంలోని అరుణాచల్ ప్రదేశ్ మరియు అస్సాంలోని తాని మరియు ఇతర సైనో-టిబెటన్ ప్రజల స్థానిక మతం.
ఉల్లంఘనకు శిక్ష : బలవంతంగా ఇతరులను మతం మార్చిన లేదా అలా చేయడానికి ప్రయత్నించిన వ్యక్తులకు ఈ చట్టం 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు రూ. 10,000 వరకు జరిమానా విధించడాన్ని నిర్దేశిస్తుంది.

అక్రమ మత మార్పిళ్లకి వ్యతిరేకంగా నిరసనలు జరిగిన మరికొన్ని ప్రాంతాలివీ…
దేశవ్యాప్తంగా మత మార్పిడులను పూర్తిగా నిషేధించాలని, మతమార్పిడులకు ప్రయత్నిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలోని జాతి జనజాతి సురక్ష మంచ్ జైపూర్‌లో నిరసన ర్యాలీ నిర్వహించింది.
2. ఛత్తీస్ గఢ్ లో…
జూన్ 30 న ఛత్తీస్ గఢ్ లోని బిలాస్ పూర్, ధమ్తారి జిల్లాలో అక్రమ మత మార్పిళ్లను వ్యతిరేకిస్తూ భారీ నిరసన జరిగింది. ధమ్తారిలో అయితే ఏకంగా చర్చి ముందే హిందువులు నిరసనకు దిగారు. చర్చిలో అక్రమ మత మార్పిళ్లు జరుగుతున్నాయన్న సమాచారం అందుకున్న హిందువులు.. అక్కడికి చేరుకొని, నిరసన వ్యక్తం చేశారు.’చంగై సభ’ నిర్వహించే ముసుగులో స్థానిక హిందువులను మతం మార్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని కార్యకర్తలు ఆరోపించారు. కార్యకర్తలు నినాదాలు చేస్తూ అక్కడికక్కడే హనుమాన్ చాలీసా పఠనం చేశారు.
3. లక్నో, గోరఖ్ పూర్ లో….
సామూహిక మత మార్పిడిని నిరసిస్తూ సెప్టెంబర్ 29 న హిందువులు నిరసన వ్యక్తం చేశారు. అయితే అక్కడి ప్రభుత్వం వెంటనే మత మార్పిడి నిరోధక చట్టాన్ని అమలు చేసి, మత మార్పిళ్లు చేస్తున్న క్రిప్టో మత మార్పిడిదారులను అరెస్ట్ చేశారు. మ్యాథ్యూ అనే వ్యక్తి… స్వస్థత కూటములు నిర్వహిస్తూ.. అక్రమ మత మార్పిళ్లను ప్రోత్సహించాడు. బైబిల్ ను పంచుతూ… భారీ ఎత్తున అక్రమ మత మార్పిళ్లను ప్రోత్సహించాడు. దీంతో స్థానిక హిందూ కార్యకర్త ధర్మేంద్ర శర్మ సెప్టెంబర్ 28న నిగోహా పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నంబర్ 186/2025కు దారితీసిన ఫిర్యాదును దాఖలు చేశారు.
4. ఛత్తీస్ గఢ్ లో విద్యార్థుల నిరసన…
ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో అక్రమ మత మార్పిళ్ల కేసు వెలుగు చూసింది. ఏకంగా చిన్నారులనే మత మార్పిళ్ల ముఠా టార్గెట్ చేసింది. తల్లిదండ్రులను ఏమార్చి, విద్యార్థులను ప్రలోభపెట్టి, పాఠశాలల దగ్గర విద్యార్థులను మతం మార్చేం దుకు రంగంలోకి దిగాయి. ఇలా పిల్లల్ని మోసం చేసి, ప్రలోభ పెట్టి, క్రైస్తవంలోకి మార్చేస్తున్న ముగ్గురు మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు.
పాఠశాల ముగిసిన తర్వాత, బయటికి వచ్చే పిల్లలపై ఒత్తిడి తెచ్చి, చర్చికి వెళ్లాలని ఈ ముగ్గురూ అడుగుతున్నట్లు తేలింది. ఈ తంతు ప్రతిరోజూ కొనసాగుతున్నట్లు చెబుతున్నారు. చివరి బెల్ కొట్టిన తర్వాత, బయటికి వచ్చే విద్యార్థులను మాటలతో మాయ చేసి, వారితో సంభాషించి, హిందూ దేవతలపై అసత్య ఆరోపణలు చేస్తూ, హిందూ దేవతలపై వ్యతిరేకంగా రోజూ చెబుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
ఈ విషయం హిందూ సంఘాల దృష్టికి వచ్చింది. వెంటనే రంగంలోకి దిగి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ముగ్గురు మహిళలపై కేసులు నమోదు చేశారు. ఇదే విషయంపై హిందూ సంఘాలు తమకు ఫిర్యాదు చేశాయని, దీంతో మతం మారమని ప్రలోభాలకు గురి చేస్తున్న ముగ్గురు మహిళల్ని అరెస్ట్ చేశామని పోలీసులు ప్రకటించారు.
ఒడిశాలో….
ఒడిశాలోని కియోంఝర్ లో ఏప్రిల్ ఏడో తేదీన అక్రమ మత మార్పిళ్లను హిందువులు తీవ్రంగా వ్యతిరేకించారు.శ్రీరామ నవమి సందర్భంగా క్రైస్తవ బోధకులు హిందూ మతానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ, క్రైస్తవంలోకి మార్చాలని ప్రయత్నించారు. దీంతో అక్కడి గిరిజనులు మిషనరీలకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. ఆ సమావేశంలో హిందూ ధర్మానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడంతో గిరిజనులకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఏడుగురు క్రైస్తవ పాస్టర్లను అరెస్ట్ చేశారు.





