News

ప్రకృతి ఆధారిత వ్యవసాయం, పర్యావరణ పరిరక్షణకు దోహదం

38views

ప్రకృతి ఆధారిత వ్యవసాయం ద్వారా ఆర్థికాభివృధికి, పర్యావరణ పరిరక్షణకు దోహదం పడుతుందని రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ ఛాన్సలర్ టి. విజయ్ కుమార్ అన్నారు.

అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలంలోని బరిసింగి గ్రామంలో ఉదయం అధికారులు ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను సందర్శించారు.

ఈ కార్యక్రమంలో రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ ఛాన్సలర్ టి. విజయ్ కుమార్ (రిటైర్డ్ IAS), జిల్లా కలెక్టర్ ఏ ఎస్ దినేష్ కుమార్, ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి తిరుమణి శ్రీపూజ సంబంధిత శాఖల అధికారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

గ్రామంలోని గిరిజన రైతులు ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో కాఫీ, పసుపు, కూరగాయల పంటలను సాగు చేస్తున్నారు.

మహిళా సంఘాల సభ్యులు స్థానికంగా తయారుచేసే బయో ఇన్‌పుట్ల (జీవామృతం, ఘనజీవామృతం, నేమ్ కాషాయం మొదలైనవి) తయారీని ప్రదర్శించి వివరించారు.

అలాగే రీలే క్రాపింగ్ పద్ధతిలో పంటలను సాగు చేయడం ద్వారా రైతులు నిరంతర ఆదాయం పొందుతున్న విధానాన్ని కూడా చూపించారు.

అధికారులు గ్రామంలోని లీడ్ ఫార్మర్లతో మాట్లాడి, ప్రకృతి వ్యవసాయం ద్వారా నేల సారవంతత పెరిగిన తీరును, పురుగు సమస్యలు తగ్గిన విధానాన్ని, రైతులకు లభిస్తున్న ఆర్థిక లాభాలను తెలుసుకున్నారు.