News

కెనడాలో భారత సినిమాల ప్రదర్శనపై దాడి.. థియేటర్‌కు దుండగుల నిప్పు

41views

కెనడా ఒంటారియో ప్రావిన్స్‌లో భారతీయ సినిమాల ప్రదర్శనపై గుర్తు తెలియని దుండగులు దాడికి పాల్పడుతున్నారు. ఓక్‌విల్లే అనే పట్టణంలోని ఓ సినిమా థియేటర్‌లో భారతీయ సినిమాలను ప్రదర్శిస్తుండగా సెప్టెంబర్‌ 25న గుర్తు తెలియని దుండగులు కొంతమంది థియేటర్‌ ప్రవేశద్వారానికి నిప్పు పెట్టారు. మంటలను వెంటనే ఆర్పివేయడంతో పెను ప్రమాదం తప్పింది.

ఈ నెల 2న ఒక దుండగుడు సినిమా హాల్‌ ఎంట్రెన్స్‌ డోర్‌ వద్ద తుపాకీ కాల్పులకు పాల్పడ్డాడు. దీంతో భారతీయ సినిమాల ప్రదర్శన నిలిపివేస్తున్నట్టు థియేటర్‌ యాజమాన్యం తాజాగా ఒక ప్రకటనలో తెలిపింది. ఈ దాడుల వెనుక ఖలీస్థాన్‌ వేర్పాటువాదుల హస్తం ఉందని భావిస్తున్నారు.