News

హిందూ అమ్మాయిలను టార్గెట్ చేసి మరీ మతం మార్చేస్తున్నారు : మిళింద్ పరాండే

214views

ముస్లింలలోని ఓ వర్గం హిందూ బాలికలను ట్రాప్ చేస్తూ, పక్కా ప్రణాళికతో కుట్రపన్ని, మతం మారుస్తున్నారని విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి మిలింద్ పరాండే మండిపడ్డారు. హిందూ సమాజానికి ఇదో సవాల్ గా నిలుస్తోందన్నారు.లక్నోలో జరిగిన సాధు సంతుల సమావేశంలో మిలింద్ పరాండే పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సమస్యను కేవలం వ్యక్తిగత సమస్య కాదని, సాంస్కృతిక దాడి అని అభివర్ణించారు. 2023 ను డేటాను ఈ సందర్భంగా ఉటంకించారు. దేశంలో 13 లక్షల మంది మహిళలు అదృశ్యమయ్యారని, వీరిలో ఎక్కువ మంది లవ్ జిహాద్ బాధితులేనని స్పష్టం చేశారు.

ఇక.. వీటితో జనాభా అసమతౌల్యత ఏర్పడుతోందని, కొన్ని వర్గాలలో జనన రేటు పెరుగుతోందని, విద్యావంతులు, ఆర్థికతపై అవగాహన వున్న హిందూ సమాజంలో మాత్రం జనన రేటు తగ్గిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అసమతౌల్యత వెనుక మత మార్పిళ్లు, లవ్ జిహాద్ తో పాటు బంగ్లాదేశ్, మయన్మార్ నుంచి అక్రమంగా ముస్లింల చొరబాటు కారణాలు కూడా వున్నాయని విశ్లేషించారు.సరిహద్దు రాష్ట్రాలలో (అస్సాం, పశ్చిమ బెంగాల్, త్రిపుర) మరియు ఇప్పుడు ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాలలో రోహింగ్యా ముస్లిం చొరబాటుదారుల సంఖ్య పెరుగుతోందని పరాండే ఆందోళన వ్యక్తం చేశారు.