
ఇండోర్‌లోని నందలాల్‌పురా పరిసరాల్లో కొంతమంది ముస్లిం ట్రాన్స్‌జెండర్లు తమను ఇస్లాం మతంలోకి మారాలంటూ బలవంతం చేస్తున్నారని హిందూ ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ సభ్యులు ఆరోపిస్తున్నారు . వారు ఉద్దేశపూర్వకంగా HIV-కలుషితమైన సిరంజిల ద్వారా తమకు ఇన్ఫెక్షన్ సోకిస్తున్నారని దానివల్ల తమలో చాలామందికి హెచ్ఐవీ సోకిందని బాధపడుతున్నారు.
మాలేగావ్‌కు చెందిన ఫర్జానా , పాయల్ అలియాస్ నయీమ్ అన్సారీ అని కూడా పిలువబడే సీమా హాజీ తమపై దూకుడుగా మతమార్పిడి ప్రచారానికి నాయకత్వం వహించారని ట్రాన్స్‌జెండర్ హిందూ నాయకురాలు సకీనా గురు పేర్కొన్నారు.
ఈ ఆరోపణలకు ప్రతిస్పందనగా ఇండోర్ పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ను ఏర్పాటు చేశారు . సకీనా వెల్లడించినదాని ప్రకారం ముస్లింగా మారము అని నిరాకరించిన వారికి HIV సోకిన సిరంజిల నుండి ఇంజెక్షన్లు ఇచ్చారనీ, దీని వలన దాదాపు 60 మంది అనారోగ్యానికి గురయ్యారని సకీనా వెళ్లడించింది.. వారిలో పన్నెండు మందిని MY హాస్పిటల్‌లోని ART సెంటర్‌లో చేర్చారు. దాంతో తమ సమాజంలోని అనేక మంది భయంతో పారిపోయారని , కొంతమంది నేరస్థులతో చేరారని ఆమె తెలిపారు.
2000 సంవత్సరంలో పాయల్ మాలెగావ్ నుండి ఇండోర్ కు వెళ్లినప్పుడు తన భార్య ,పిల్లలను అక్కడే వదిలేసి వెళ్లాడని, అక్కడికి చేరుకున్న తర్వాత లింగమార్పిడి చేసే వ్యక్తులను ముస్లింలుగా మారమని ఒత్తిడి చేయడం ప్రారంభించాడని ఆమె పేర్కొన్నారు. సీమాహాజీ తనను హజ్ యాత్ర చేయమని బలవంతం చేసిందని, ఆ తర్వాత ఆమెను మతం మార్చడానికి ప్రయత్నించిందని సకీనా వెల్లడించింది. ఆ తర్వాత, వారి ఉద్దేశాలను గ్రహించిన తర్వాత ఆమె తనకంటూ సొంత సంస్థను పెట్టుకుంది. అయితే, సీమాహాజీ హిందూ సభ్యులపై ముస్లింలుగా మారాలంటూ క్రమంగా ఒత్తిడి తీసుకురావడం ప్రారంభించింది , అంతేకాకుండా మహారాష్ట్ర నుండి మరికొంతమంది ముస్లిం లింగమార్పిడి చేసేవారిని పిలిపించింది. ఈ విషయంపై పోలీస్ కమిషనర్, పిఎంఓ, సిఎంఓ, సిజెఐ ఇతర ఉన్నతాధికారులకు చట్టపరమైన ఫిర్యాదులు అందచేశారని సకీనా న్యాయవాది తెలియజేశారు. వారు దీనిపై వీడియోను కూడా ఒకటి రిలీజ్ చేశారు. ఆ వీడియోలో ఆయన, “కిన్నార్ జిహాద్” బాధితులైన సుమారు 100 మంది అనారోగ్య వ్యక్తులు ఇండోర్‌లో వైద్య పర్యవేక్షణ లేకుండా నివసిస్తున్నారని పేర్కొన్నారు.
ఈ వివాదం రెండు పార్టీల మధ్య పదే పదే ఘర్షణలకు దారితీసింది. చందన్ నగర్ , విజయ్ నగర్ లోని పోలీస్ స్టేషన్లకు అధికారిక ఫిర్యాదులు అందాయి. గత నెలలో, పంద్రినాథ్ పోలీస్ స్టేషన్ లో ఇలాంటి అశాంతి చోటు చేసుకోవడంతో స్టేషన్ ఇన్ చార్జి కూడా బదిలీ అయ్యారు.
పంద్రినాథ్ స్టేషన్‌లో జరిగిన ప్రదర్శన తర్వాత సకీనా కలెక్టర్ ఆశిష్ సింగ్‌కు ఫిర్యాదు చేశారు. ఈ కేసును SDM నిధి వర్మకు అప్పగించారు. సకీనా బృందం నుండి వచ్చిన నిరసనలు, ఆత్మహత్య బెదిరింపులకు ప్రతిస్పందనగా పోలీస్ కమిషనర్ సంతోష్ కుమార్ సింగ్ DCP రిషికేశ్ మీనా . ఇతర ఉన్నతాధికారుల నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. ప్రజారోగ్యతో పాటుగా సమాజంపై దీని ప్రభావం ఉన్నందున అధికారులు విచారణను చాలా సున్నితమైనదిగా వర్గీకరించారు. ఈ విషయంపై ఇంకా విచారణ కొనసాగుతోంది.





