News

22 మంది మావోయిస్టుల లొంగుబాటు

229views

తమతో చర్చలు జరపాలన్న మావోయిస్టుల విజ్ఞప్తిని కేంద్ర ప్రభుత్వం పక్కన పెట్టిన సంగతి తెలిసిందే. మావోయిస్టులు లొంగిపోవాల్సిందేనని, లేకపోతే ఏరివేత తమ ముందున్న లక్ష్యమని కేంద్రం హెచ్చరించింది. ఈ నేపథ్యంలో విడతల వారీగా మావోయిస్టులు లొంగిపోతున్నారు. తాజాగా మరో 22 మంది మావోయిస్టులు లొంగిపోఆయరు.

నారాయణపూర్‌ ఎస్పీ ఎదుట మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన 22 మంది మాదోయిస్టుల్లో 8 మంది మహిళలున్నారు. లొంగిపోయిన మావోయిస్టులపై రూ. 37 లక్షల రివార్డ్‌ ఉంది.

కాగా, వరుస ఎన్‌కౌంటర్ల నేపథ్యంలో మావోయిస్టులు సరెండర్‌ అవుతున్నారు. గత నెలలో కొత్తగూడెం ఎస్పీ ముందు 12 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టుల్లో ముగ్గురు మహిళా మావోయిస్టులున్నారు. గత ఏడు నెలల్లో 310కి పైగా మావోయిస్టులు లొంగిపోయారు.

మావోయిస్టు అగ్రనేతలు ఎక్కడున్నారు.. వారి కదలికలు ఎలా ఉన్నాయనే దానిపై పోలీస్‌ ఇంటెలిజెన్స్‌ విభాగం తీవ్రంగా శ్రమిస్తోంది. ఇందుకోసం మానవ వనరులతోపాటు ఆధునిక టెక్నాలజీని ఉపయోగిస్తోంది. ఈ క్రమాన అనేక మంది అగ్రనేతలకు సంబంధించిన జాడ తెలిసిన వెంటనే కూంబింగ్‌ మొదలుపెట్టారు. మావోలకు పట్టున్న ప్రాంతాల నుంచి వారిని బయటకు రప్పించేలా వ్యూహాత్మకంగా సెర్చ్‌ ఆపరేషన్లు చేపట్టారు.