News

జమ్మూ కశ్మీర్ లో రెచ్చిపోయిన ఇస్లామిక్ మూక.. డీఎస్పీపై మూకదాడి

279views

జమ్మూ కశ్మీర్ ఇస్లామిక్ మూక రెచ్చిపోయింది. డీఎస్పీపై దాడికి దిగింది. ఈ ఘటన ఈ నెల 4 వ తేదీన జరిగింది. మొహర్రం ఊరేగింపు సందర్భంగా హిజ్బుల్లా జెండాలను తొలగించడానికి పోలీసులు ప్రయత్నాలు చేశారు. ఈ సమయంలోనే ఇస్లామిక్ మూకలు రెచ్చిపోయి, డీఎస్పీపై మూక దాడికి దిగింది.ప్రత్యక్ష సాక్ష్యుల చెప్పిన దాని ప్రకారం హిజ్బుల్లాతో సంబంధమున్న జెండాలు, బ్యానర్లను పోలీసులు తొలగిస్తున్న సమయంలోనే ఈ దాడి జరిగిందని వెల్లడించారు. దీనికి సంబంధించిన స్పష్టమైన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరోవైపు ఊరేగింపు సమయంలో ‘‘పెహచాన్ హమారీ హిజ్బుల్లా’’ (మా గుర్తింపు హిజ్బుల్లా’’) అంటూ రెచ్చగొట్టే నినాదాలు కూడా చేశారు. అంతేకాకుండా స్థానిక పోలీస్ స్టేషన్ గోడపై హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా పోస్టర్ ను కూడా అతికించినట్లు తెలుస్తోంది.

అయితే.. అల్లరి మూకలను చెదరగొట్టడానికి పోలీసులు అదనపు బలగాలను రంగంలోకి దించారు. అయితే.. ఈ ఇస్లామిక్ మూక దాడిలో ఎందరికి గాయాలయ్యాయి? వారి పరిస్థితి ఏమిటి? అన్న దానిపై మాత్రం పోలీసులు ఇంకా వివరాలు వెల్లడించలేదు. ఈ దాడిలో పాల్గొన్నవారి, ఊరేగింపులో పాల్గొన్న వారిని గుర్తించే ప్రక్రియ మాత్రం ప్రారంభమైందని పోలీసులు చెబుతున్నారు.