
అస్సాం లోని టిన్సుకియా జిల్లాలోని మార్గెరిటా పట్టణంలో ఓ 16 ఏళ్ల బాలికను పాస్టర్ అత్యాచారం చేశాడు. నిందితుడు మార్గెరిటాకు చెందిన పాస్టర్ ఐజాక్ హపట్‌గా గుర్తించారు. జూన్ 10న ఈ సంఘటన జరిగింది. ఐజక్ ఇంట్లో తన భార్య లేని సమయంలో మైనర్ అయిన ఆ అమ్మాయిని బెదిరించి తమ ఇంటికి తీసుకెళ్లాడు, ఆ తర్వాత ఆమెపై అత్యాచారం చేశాడు. జూన్ 22న ఎలాగోలా అతని బారి నుంచి తప్పించుకుని బాధితురాలు ఇంటికి తిరిగి రావడంతో ఈ దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఆమె శారీరక పరిస్థితిని చూసిన కుటుంబ సభ్యులు ఏమైందని ప్రశ్నించగా బాలక తనపై జరిగిన దాడులు గురించి చెప్పింది. వెంటనే ఆమె కుటుంబం మార్గెరిటా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఐజాక్ హపట్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని, మరణశిక్ష విధించాలని ఆ కుటుంబం డిమాండ్ చేస్తోంది.
కేసు నమోదు చేసుకున్న తర్వాత మార్గరీటా పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ ఆఫీసర్ ప్రతాప్ గొగోయ్ నేతృత్వంలోని పోలీసుల బృందం పాస్టర్ ఐజాక్ హపత్‌ను అతని ఇంటి నుండి అదుపులోకి తీసుకుని మార్గరీటా పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చింది. మార్గరీటా పోలీస్ స్టేషన్‌లో POCSO చట్టం 2012లోని కేసు నంబర్ 76/2025 US 64 BNS, R/W సెక్షన్ 6 కింద పాస్టర్ పై కేసు నమోదు చేయబడింది. మార్గరీటా సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ కోర్టు పాస్టర్ ఇసాక్ హపత్‌ను టిన్సుకియాలోని జ్యుడీషియల్ కస్టడీకి పంపింది.
ఈ విషయం తెలిసిన స్థానికులు కూడా పాస్టర్ కు వ్యతిరేకంగా ఆందోళనలు చేశారు. మైనర్ బాలికకు రక్షణ కల్పించాలని, నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.





