
కలియుగ వైకుంట క్షేత్రం తిరుమల. స్వామివారు కొలువైన ఆలయంలోని గర్భగుడి పైభాగంలో ఉన్న బంగారు గోపురాన్ని ఆనంద నిలయం అని అంటారు. ప్రతి భక్తుడు స్వామి దర్శనం కోసం తిరుమల కొండపైకి అడుగు పెట్టగానే పెట్టగానే పులకించి పోతాడు. అటువంటి ఆలయ నమూనా సెట్టింగ్ తో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మిలటరీ హోటల్ నిర్మించారు. అయితే శ్రీవారి శ్రీవారి ఆలయ సెట్టింగ్ తో మాంసాహార హోటల్ నిర్వహణపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతుంది. ఈ మేరకు టీటీడీ చైర్మన్, ఈవో, అదనపు ఈఓ కు జనసేన పిర్యాదు చేసింది.
అదిగో ఆనంద నిలయం అని ఆనందంగా వెళ్లారో అవాక్కయిపోతారు. అక్కడకు వెళితే, చికెన్, మటన్ బిర్యానీల ఘాటు వాసన గుప్పుమంటుంది. అది ఆలయంలా కనిపించే నాన్‌వెజ్ హోటల్. గోవిందుడి పేరుతో భక్తులను ఇలా బురిడీ కొట్టిస్తున్నారు కొందరు కేటుగాళ్లు. ఇక తిరుమల యాత్ర పేరుతో వెంకన్నను ఏకంగా గేమింగ్ యాప్‌లో దింపేశారు మరికొందరు. ఇక ఓ సినిమాలో ఏకంగా గోవింద నామాలపైనే పేరడీ పాటలు పెట్టారు మరికొందరు. గాడ్‌తో గేమ్స్ వద్దన్నా వినకుండా, ఇలా చెలరేగిపోతున్నారు కొందరు ప్రబుద్ధులు.
పైకి ఆనంద నిలయం..లోన నాన్‌వెజ్ హోటల్
పైకి ఆనంద నిలయంలా కనిపించే ఆలయ వాతావరణం.. లోపల నాన్‌వెజ్ మిలటరీ హోటల్ రన్నింగ్. దేవుడిని ఇలా క్యాష్ చేసుకుంటున్నారు కొందరు కన్నింగ్ గాళ్లు. చూడడానికి శ్రీ వేంకటేశ్వరుడి మందిరంలా ఉన్నా అది దేవాలయం కాదు. రాజమండ్రి-విశాఖ హైవేపై తిరుమల ఆనందనిలయాన్ని పోలి ఉన్న ఓ సెట్టింగ్. ఓ మిలటరీ హోటల్‌కి ఈ తరహా సెట్టింగ్‌లు అద్ది క్యాష్ చేసుకుంటున్నాడు ఓ నిర్వాహకుడు. మల్లిపల్లి దగ్గర ఓ హోట్‌లో తిరుమల ఆనంద నిలయంలా సెట్టింగ్ ఏర్పాటు చేయడంపై వివాదం నెలకొంది. హోటల్‌లో తిరుమల వెంకటేశ్వర స్వామి కొలువై ఉండే ఆనంద నిలయం సెట్టింగ్‌ని వేసి, అక్కడే నాన్‌వెజ్ వడ్డిస్తూ మిలటరీ హోటల్ నడుపుతున్నారు కొందరు ప్రబుద్ధులు.





