
ఢిల్లీలో మరో లవ్ జిహాద్ కేసు వెలుగులోకి వచ్చింది. నకిలీ గుర్తింపు ద్వారా హిందూ అమ్మాయిని ప్రేమ లోకి దింపి మూడేళ్లపాటు లైంగికంగా వాడుకున్నాడన్న ఆరోపణలపై ఫైసల్ మొఘల్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఉత్తరప్రదేశ్ కు చెందిన హిందూ అమ్మాయికి ఢిల్లీలోని చాందినీ చౌక్లోని బల్లిమారన్ నివాసి అయిన పైజల్ మొఘల్ తో పరిచయం ఏర్పడింది. అతను రాహుల్ అనే హిందూ పేరు పెట్టుకుని అమ్మాయికి 2021 జూన్ లో ఫేస్ బుక్ లో ఫ్రెండ్ రిక్వస్ట్ పంపించి స్నేహం చేశాడు. దీని తర్వాత, ఆమెను ప్రేమిస్తున్నానని మాయమాటలు చెప్పి, మూడేళ్లపాటు ఆమెను లైంగికంగా దోపిడీ చేశాడు. ఆ మూడేళ్ల పాటు తాను హిందువుగానే ప్రవర్తించాడని టోపీ పెట్టుకోలేదని, పూజలు చేశాడనీ తన ప్రవర్తన వల్ల అతను ముస్లిం అని తెలియలేదని ఆ అమ్మాయి చెప్పింది.
ఈ కారణాలన్నింటి వల్లే ఆమె అతన్ని నమ్మింది. రాహుల్ కూడా తనను రెండుసార్లు గర్భస్రావం చేయించుకోవాలని బలవంతం చేశాడని ఆమె ఆరోపించింది. చివరికి ఆ అమ్మాయి తనను వివాహం చేసుకోమని అడిగినప్పుడు, మొదట సాకులు చెప్పాడు. దాంతో అనుమానం వచ్చిన ఆ అమ్మాయి గట్టిగా అడగ్గా తన నిజస్వరూపాన్ని బయట పెట్టాడు. ఆ తర్వాత తనను వివాహం చేసుకోవాలంటే ఇస్లాం మతంలోకి మారాల్సి ఉంటుందని లేకుంటే తనను పెళ్లిచేసుకోనని వాదించాడు. దీంతో అసలు నిజం తెలుసుకునన ఆ అమ్మాయి అతనిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులకు ఫైజల్ గురించి అసలు నిజం తెలిసింది. అతను ముస్లిం అనీ, హిందువు కాదని పోలీసులు చెప్పారు. కేవలం ఈ అమ్మాయి మాత్రమేనా లేక ఇతర అమ్మాయిలను కూడా ఈ విధంగానే ట్రాప్ చేశాడా అని తెలుసుకోవడానికి ఫైజల్ ను విచారిస్తున్నామని పోలీసులు చెప్పారు.





