
మహారాష్ట్ర థానేలోని కళ్యాణ్ ఈస్ట్‌లోని ఆదివాలి ధోకలి ప్రాంతంలో, ఒక హిందూ కుటుంబంపై మత ఛాందసవాదులు దాడి చేశారు. ఇక్కడి మన్పాడ పోలీస్ స్టేషన్‌లో హిందూ కుటుంబం ఫిర్యాదు చేసింది.
పోలీసుల వివరాల ప్రకారం, స్థానిక హిందూ కుటుంబం పొరుగున నివసిస్తున్న మహిళ నజ్మిన్ నజీర్ ఖాన్ ఇంటి ముందు చెత్తను వేస్తుండగా, ఫిర్యాదుదారు భర్త వేదప్రకాష్ పట్రేలాల్ నిషాద్ ఆమెను
వారించాడు. ఆమె వారితో వాదించి నిషాద్ చెవిపై కొట్టింది.ఇది చూసి, నిషాద్ భార్య మరియు నజ్మిన్ నజీర్ ఖాన్ వాదించుకోవడం ప్రారంభించారు.
ఆ తర్వాత, నజ్మిన్ మరియు ఆమె కుటుంబ సభ్యులు షారుఖ్ నజీర్ ఖాన్, సల్మాన్ నజీర్ ఖాన్, అర్బాజ్ ఖాన్ నిషాద్ కుటుంబంపై దాడి చేశారు మరియు అర్బాజ్ ఖాన్ అర్ధ నగ్న స్థితిలో వారిని అవమానపరిచేలా చేశాడని ఫిర్యాదుదారుడు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.పోలీసులు ఈ అంశంపై కేసును మరింత దర్యాప్తు చేస్తున్నారు.





