
256views
రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో భక్తులు సంతృప్తికరమైన దర్శనం చేసుకోవడమే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ చంద్రమోహన్ వెల్లడించారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ భక్తులు సంతృప్తి చెందే విధంగా దర్శనం కల్పించాలన్న లక్ష్యంగా 6 సూత్రాలను నిర్దేశించుకుని కృషి చేస్తున్నామని, భక్తుల సదుపాయాలపై దేవాదాయ శాఖ ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. స్వచ్ఛ ఆంధ్ర పై దేవాదాయ శాఖ ప్రత్యేక దృష్టి పెట్టినట్టు వెల్లడించారు.అంతర్గతంగా ఉన్న ఆలయాల్లో బ్యాటరీ వెహికల్స్ వీల్ చైర్స్ వంటి రవాణా సదుపాయాలను అధికంగా అందుబాటులో ఉండే చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయ మాస్టర్ ప్లాన్ ను మరో రెండు, మూడు నెలల్లో అమలు చేసే దిశగా అన్ని రకాలుగా చర్యలు చేపట్టామన్నారు.





