
గ్రామ వికాస్ సమితి ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా పిడుగురాళ్లలోని శ్రీసాయి వ్రద్ధాశ్రమంలో జూన్ 11 వ తేదీన రైతులకు ప్రకృతి వ్యవసాయ సదస్సును నిర్వహించారు. కొత్త గణేశునిపాడు గ్రామ సర్పంచ్ శ్రీ పొందూరి నర్సింహారావుగారి 20 ఎకరాల ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4గంటల వరకు జరిగిన సదస్సులో 13 గ్రామాల నుండి వచ్చిన 55 మంది రైతులు పాల్గొన్నారు. భవిష్యత్తు తరాలు రోగాల బారిన పడకుండా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలంటే ప్రకృతి వ్యవసాయమే పరిష్కార మార్గమని, ప్రభుత్వాలు కూడా ఈ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని రైతులు కోరారు. భూ సమతుల్యత, వైవిధ్యం కాపాడుకోవడం ప్రజలందరి సమష్టి బాధ్యత అని తెలిపారు.
చివరగా ప్రకృతి వ్యవసాయ ఆదర్శ రైతు కొత్త గణేశునిపాడు సర్పంచ్ శ్రీ పొందూరి నర్సింహ్మారావు గారితో పాటు ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతు సోదరులను గ్రామ వికాస్ తరఫున సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామ వికాస్ ప్రాంత సంయోజక్ శ్రీ తిరుపతయ్య గారు సహ ప్రాంత సంయోజక్ శ్రీ రెడ్డి నాయుడు గార్లు పాల్గొని రైతులకు మార్గ నిర్దేశం చేశారు.





