News

బెలూం గుహలకు ”భౌగోళిక వారసత్వ” గుర్తింపు

158views

నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలంలోని బెలూం గుహలకు భౌగోళిక వారసత్వ ప్రదేశంగా జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా గుర్తింపునిచ్చింది. సుమారు 23 ఎకరాల విస్తీర్ణంలో భూమి లోపల ఏర్పడిన వీటిని క్రీస్తుపూర్వం 450 ఏళ్ల కిందట నివాస స్థలాలుగా వినియోగించినట్లు ఆధారాలు ఉన్నాయని తెలిపింది. ఈ సందర్బంగా జిల్లా పర్యాటక శాఖ అధికారి సత్యనారాయణ మాట్లాడుతూ, భౌగోళిక వారసత్వ గుర్తింపుతో దేశ పర్యాటక ప్రదేశాల జాబితాలో స్థానం పొందుతుందని అన్నారు.

భౌగోళిక వారసత్వ జాబితాలో ప్రఖ్యాత బెలూం గుహలకు గుర్తింపు దక్కడంపై హర్షం వ్యక్తం పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ చేశారు.ప్రపంచలో రెండోది, దేశంలోనే పొడవైన అంతర్భాగ గుహలుగా బెలూం గుహలు ప్రసిద్ధి అని, పురాతన సంస్కృతీ నిలయాలు ఈ బెలూం గుహలన్నారు.జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకటనతో పర్యాటకంగా మరింత ప్రాచుర్యం లభిస్తుందని, జీఎస్ఐ జాబితాలో చోటు దక్కడం వల్ల బెలూం గుహలు మరింత అభివృద్ధికి నోచుకోనున్నాయని చెప్పారు. విదేశీ పర్యాటకులను ఆకట్టుకునేలా మరింత ప్రచారం కల్పిస్తామని తెలిపారు.