News

పల్లవుల కాలంనాటి శిల్పాలు లభ్యం

213views

తమిళనాడులోని విల్లుపురం జిల్లా తిరువెనైనల్లూరు సమీపంలోని మేల్‌దనియాళంపట్టు గ్రామంలో పురావస్తుశాఖ జరిపిన తవ్వకాల్లో పల్లవరాజుల కాలంనాటి దేవతామూర్తుల శిల్పాలు లభ్యమయ్యాయి. ఈ గ్రామంలో విల్లుపురంకు చెందిన పురావస్తుశాఖ పరిశోధకులు సెంగుట్టువన్‌, తమిళలగన్‌ పర్యవేక్షణలో తవ్వకాలు కొనసాగుతున్నాయి. జరిపిన తవ్వకాల్లో పల్లవరాజుల కాలంనాటి కొరవై, మూర్తదేవి శిల్పాలు బయల్పడ్డాయి.

వీటిన పరిశీలించిన పరిశోధకులు దక్షిణ ప్రాంతాన్ని పరిపాలించిన పల్లవరాజ వంశీయులు వందల సంఖ్యలో దేవాలయాలను నిర్మించి నిత్యపూజలు చేయించారని, ఆ రీతిలో విల్లుపురం జిల్లాలో నిర్మించిన ఆలయాల్లో మేల్‌దనియాళంపట్టు గ్రామం చెరువుగట్టున విష్ణుదుర్గాలయం ఒకటని తెలిపారు.