News

భక్తులకు మెరుగైన వసతులు కల్పించండి

212views

శ్రీశైల శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనార్థం వచ్చే భక్తులకు మెరుగైన వసతులు కల్పించేందుకు అధికారులు చొరవ తీసుకోవాలని దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు ఆదేశించారు.శ్రీశైలంలోని దేవస్థాన పరిపాలన భవనంలోని సమావేశ మందిరంలో పలు పాలనాంశాలపై అధికారులతో ఈఓ సమీక్ష నిర్వహించారు. క్షేత్రాన్ని సందర్శించే భక్తులకు వసతి కల్పన, సౌకర్యవంతమైన దర్శనం ఏర్పాట్లు, అన్నప్రసాద వితరణ, క్షేత్ర పారిశుద్ధ్యం తదితర అంశాలకు సంబంధించి ఈఓ పలు సూచనలు చేశారు. భక్తుల రద్దీకిఅనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఇంజినీరింగ్‌ విభాగం తగు ప్రణాళికలు రూపొందించాలని అన్నారు. సమావేశంలో డిప్యూటీ కార్యనిర్వహణాధికారి ఆర్‌.రమణమ్మ, ఎగ్జిక్యూటీవ్‌ ఇంజినీర్లు పి.మురళీబాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.