News

పాఠశాలలో పిల్లల చేత కలీమా చదివించిన ముస్లిం టీచర్

251views

హరియాణాలోని పానిపట్లో ఒక ఉపాధ్యాయురాలి నిర్వాకం విస్తుపోయేటట్టు ఉంది. హరియాణాలోని పానిపట్లో ఈమె సరస్వతీ విద్యామందిర్ పాఠశాలలోనే దుశ్చర్యకు పాల్పడింది. పేరుకు సంస్కృత ఉపాధ్యాయురాలు, మెదడంతా ఇస్లాం మతోన్మాదం, మహజీబ్ అన్సారీ అనే ఈ ఉపాధ్యాయురాలు 8వ తరగతి పిల్లల చేత కలీమా చదివించింది. మాహి అని అంతా పిలిచే ఈమె ఈ పనికి పాల్పడింది. దీనితో కొందరు పిల్లలు ఇంటిదగ్గర కూడా కలీమా పఠించడం మొదలు పెట్టారు. దీనితో తల్లిదండ్రులు హిందూ సంఘాల సహాయంతో పాఠశాల యాజమాన్యాన్ని నిలదీశారు.

పోలీసులు కూడా రంగ ప్రవేశం చేశారు. దీనితో ఆ పాఠశాల ప్రిన్సిపాల్ ఇందుబాల ఆమెను ఉద్యోగం నుంచి తొలగించారు. ఈమెను సంవత్సరం క్రితమే సంస్కృత బోధకురాలిగా నియమించినట్టు ఇందుబాల ది ప్రింట్ వార్తా సంస్థకు తెలియచేశారు. విద్యార్థులు ముస్లిం సంప్రదాయాల గురించి అడిగినప్పుడు వాటిని వివరించానని, ఆ క్రమంలోనే కలీమా గురించి చెప్పానని మాహి చెబుతున్నారు. ఈమెకు ఒక ముస్లిం పేరు ఉండగా, మాహి అని ఎందుకు పిలుస్తున్నారని కూడా తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు కూడా అక్కడే ఉండడంతో ఆమెను ఉద్యోగం నుంచి తొలగించి అక్కడితో వ్యవహారం ఆగేలా చేశారు.