
వైఎస్సార్ కడప జిల్లాలో శుక్రవారం దారుణం జరిగింది. పెళ్లికి వచ్చిన ఓ మూడేళ్ల చిన్నారిపై రెహ్మతుల్లా అత్యాచారం చేశాడు. అంతేకాకుండా చిన్నారిని దారుణంగా కొట్టిచంపి, ముళ్ల పొదల్లోకి పడేశాడు. దీంతో స్థానికుల్లో ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. నిందితుడు రెహ్మాన్ ను చితకబాదారు. అనంతరం పోలీసులకు పట్టించారు. అంతేకాకుండా శనివారం రోజు నిందితుడు రెహ్మతుల్లా ఇంటిని కూడా స్థానికులు కూల్చేశారు.జేసీబీ సాయంతో అతని ఇంటిని కూల్చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
గ్రామస్తులు చేసిన పనిని చాలా మంది మెచ్చుకుంటున్నారు. రహ్మతుల్లా పదోతరగతి వరకు చదువుకున్నాడు. జులాయిగా తిరుగుతూ మద్యానికి బానిసగా మారినట్లు స్థానికులు చెప్తున్నారు. ఓ పెళ్లి కోసం బాధిత కుటుంబీకులు మైలవరం మండలంలోని ఓ గ్రామానికి వచ్చారు. అందరూ పెళ్లి హడావుడిలో వుండగా.. రహ్మతుల్లా బాలికను ఆడిస్తున్నట్లు నటించాడు. ఆ తర్వాత పక్కకి తీసుకెళ్లి, చిన్నారి నోట్లో అరటి పండు కుక్కి, అత్యాచారానికి పాల్పడ్డాడు.





