
ఈశాన్య ఢిల్లీ ప్రాంతంలోని సీలంపూర్ ప్రాంతంలో మసీదు విస్తరణ తీవ్ర వివాదం అవుతోంది. బ్రహ్మపురిలోని 12 వ లైన్ లో వున్న అల్ మతీన్ మసీదు విస్తరణ అంశం చాలా రోజులుగా నలుగుతూనే వుంది. ఈ సమస్య మళ్లీ అక్కడ తెరపైకి వచ్చింది. అయితే మసీదు విస్తరణను మాత్రం స్థానిక హిందువులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మసీదు నిర్మాణమే తప్పుడు మార్గాల ద్వారా జరిగిందని మండిపడుతున్నారు. ఓ పథకం ప్రకారం, కుట్ర ప్రకారమే ఇప్పుడు మళ్లీ మసీదు విస్తరన అంటున్నారని ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా ఇళ్లకు ‘‘ఇల్లు అమ్మబడును’’ అని పోస్టర్లు కూడా వెలిశాయి. దీనంతటి వెనుకా కుట్ర వుందని హిందువులు అంటున్నారు.
అయితే చాలా పురాతనమైన శివాలయానికి నేరుగా ఈ మసీదుకి సంబంధించిన ఓ గేటు వుంది. దీనిని ముస్లిం పదే పదే తెరుస్తున్నారు. దీనిపై హిందువులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మసీదు విస్తరణకు గానీ, అభివృద్ధికి గానీ విదేశాల నుంచి ధనం వస్తోందని, నల్ల ధనాన్ని కూడా వాడుతున్నారని హిందువులు సంచలన ఆరోపణలకు దిగుతున్నారు. కావాలనే కుట్రలో భాగంగానే మసీదు విస్తరణకు విదేశీ నిధులు వస్తున్నాయని అంటున్నారు.
ఈ మసీదు విస్తరణను కేవలం మతపరమైన కోణంలో మాత్రమే చూడొద్దని, స్థానికంగా వుండే జనాభాలో మతపరమైన మార్పులు తీసుకురావడం, హిందూ సమాజాన్ని అణచివేయడానికే తెరపైకి తెస్తున్నారన్న విమర్శలను హిందువులు చేస్తున్నారు.
మసీదు నిర్మాణం ప్రారంభమైన సమయంలో హిందువులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు .ఉద్రిక్తతలు కూడా జరిగాయి. దీంతో నిర్మాణాన్ని ఆపాలని, ఇందుకు పోలీసు శాఖ జోక్యం చేసుకోవాలని కూడా హిందువులు చాలా సార్లు డిమాండ్ చేశారు. అయినా.. ఎవ్వరూ పట్టించుకోలేదు. అయితే మసీదు విస్తరణకు ఇప్పటికే 2 కోట్లు ఖర్చయ్యాయని, అందుకే ఆపలేమని కూడా పోలీసులు అన్నట్లు ఆరోపణలున్నాయి.
అయితే మొదట్లో హిందువులు ఫిర్యాదు చేయడంతో నిర్మాణాన్ని పోలీసు శాఖ నిలిపివేయించింది. కానీ.. మసీదు కమిటీ 2024 లో ఢిల్లీ మున్సిపల్ కార్పొరేష్ నుంచి అనుమతి పొందింది. దీంతో నిర్మాణం తిరిగి ప్రారంభమైంది. 2025 ఫిబ్రవరి మాసంలో మరింత పుజుకుంది. దీంతో మళ్లీ ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో మున్సిపల్ కార్పొరేషన్ నిర్మాణాన్ని ఆపేయాలని ఆదేశించింది. మసీదు కమిటీకి నోటీసులు పంపింది. అధికారికంగా నిర్మాణంపై నిషేధం వున్నా… మసీదు కమిటీ పరిగణనలోకి తీసుకోకుండా నిర్మాణాన్ని కొనసాగిస్తోంది. దీనిని నిలిపేయాల్సింది పోయి… నిరసన వ్యక్తం చేస్తున్న హిందువులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.





