
డీఎంకే పరిపాలిస్తున్న తమిళనాడులో ల్యాండ్ జిహాద్ వెలుగులోకి వచ్చింది. సేలం జిల్లాలోని కరుప్పన్నర్ స్వామి ఆలయానికి ఆనుకొనే వున్న భూమిని ముస్లింల ప్రార్థనల కోసం అక్కడి ప్రభుత్వం కేటాయించింది. దీంతో అక్కడ వివాదం రేగింది. ఇది ల్యాండ్ జిహాదే అని హిందువులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే ఉప సంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
అయ్యంకాటు వలివులో అనే ప్రాంతంలో కరుప్పన్నార్ స్వామి ఆలయం వుంది. హిందువులు అధిక సంఖ్యలో ఈ స్వామి వారి దర్శనానికి వస్తుంటారు. అత్యంత పురాతన ఆలయంగా ప్రసిద్ధి కూడా చెందింది.ఈ నెల 26 న కడైయంపట్టి తహశీల్దార్ తో పాటు ఇతర అధికారులు సర్వేయర్ తో కలిసి ఆలయం దగ్గరికి వచ్చారు. ఈ ఆలయానికే అంటుకొని వున్న 1.63 ఎకరాల భూమి నిరుపయోగంగా వుందని పేర్కొన్నారు. ఏం చేస్తారని స్థానికులు ప్రశ్నించగా… ముస్లింలు ప్రార్థనలు చేసుకోవడానికి ఈ భూమిని కేటాయిస్తున్నట్లు తహశీల్దార్ అసలు విషయాన్ని వెల్లడించారు.
ఈ వార్త హిందువులందరికీ చేరింది. ఈ నిర్ణయాన్ని భక్తులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. హిందూ ఆలయానికి ఆనుకొని వున్న స్థలంలో ముస్లింల ప్రార్థనలకు అనుమతులు ఇస్తే.. రాబోయే రోజుల్లో ఉద్రిక్తతలు తలెత్తుతాయని పేర్కొన్నారు.అంతేకాకుండా రానూ రానూ ఆలయ భూమి కూడా తమదేనని వాదించేందుకు కూడా వెనుకాడరని హెచ్చరించారు.
మరోవైపు స్థానికంగా వుండే ఇందిరా రాణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నిర్ణయం మత ఘర్షణలకు దారి తీస్తుందని, భూ కేటాయింపును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇంత నిరసన కార్యక్రమాలు జరుగుతున్నా… అధికారులు మాత్రం ఈ భూమికి సరిహద్దు గుర్తులను కూడా ఏర్పాటు చేయడం ప్రారంభించారు. అభ్యంతరాలున్నా అసలు లెక్కలోకే తీసుకోమన్న సంకేతాలను పంపుతున్నారు. మరోవైపు హిందువులు కూడా తాము వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారు.
భక్తులు దీనిని ల్యాండ్ జిహాద్ గా పేర్కొంటున్నారు. కొంత మంది ప్రభుత్వ అధికారులు హిందూ వారసత్వ ప్రదేశాలను, మత ప్రదేశాల పవిత్రతను కాపాడకుండా ముస్లింల ప్రయోజనాలకే పని చేస్తున్నారని మండిపడుతున్నారు.
ముస్లింలే తమ మొదటి ప్రాధాన్యతా అంశమని, పరిపాలన తర్వాత అంశంగా స్టాలిన్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శకులు కూడా మండిపడుతున్నారు. పాలనా పరంగా ఉన్నత పదవుల్లో వున్న ముస్లిం అధికారులు పాలనా పరమైన నిర్ణయాలు తీసుకునే సమయంలో మతానికి మొదటి ప్రాధాన్యతను ఇస్తున్నారని కూడా విమర్శలు వస్తున్నాయి. మెజారిటీ ప్రజల్లో కూడా ఇదే భావన గూడుకట్టుకొని వుందని, ఇలాగే వుంటే మాత్రం కచ్చితంగా తమిళనాడులో మతపరమైన ఘర్షణలు తలెత్తే ప్రమాదం వుందని హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని, సవరించాలని డిమాండ్ చేశారు.





