News

మోహన్‌లాల్‌ పూజలపై ముస్లిం సంస్థల అభ్యంతరం

510views

ఇద్దరు దక్షిణాది సూపర్‌స్టార్లే. చాలామంది వాళ్లిద్దరు ఇండస్ట్రీలో ప్రత్యర్ధులని పొరపడుతారు.. కాని ఇద్దరు ఆప్తమిత్రులు… వారే మమ్ముటి , మోహన్‌లాల్‌. మలయాళం సినీ ఇండస్ట్రీకి రెండు కనులు లాంటి వారు. అయితే వారి ఫ్రెండ్‌షిప్‌ విషయంలో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. అనారోగ్యంతో బాధపడుతున్న మమ్ముట్టి తొందరగా కోలుకోవాలని శబరిమల అయ్యప్ప ఆలయంలో మోహన్‌లాల్‌ పూజలు చేయడంతో మమ్ముటి ముస్లిం కావడంతో ఎప్పటిలాగే ఎడారి మత ఛాందసులు గగ్గోలు పెడ్తున్నారు. శబరిమలలో మోహన్‌లాల్‌ పూజలు చేసిన వీడియో సామాజిక మాద్యమాల్లో వైరల్‌గా మారింది.

మమ్ముటి ముస్లిం.. ఆయన అసలు పేరు మహ్మద్‌ కుట్టి.. అలాంటప్పుడు ఆయన వేగంగా కోలుకోవాలని అల్లానే ప్రార్ధించాలి.. కాని అయ్యప్పస్వామిని ఎలా మోహన్‌లాల్‌ వేడుకుంటారని కొన్ని ముస్లిం సంస్థలు అర్ధం పర్దం లేని ప్రశ్నలు వేస్తున్నాయి. శబరిమలలో మోహన్‌లాల్‌ ఆయన కోసం ప్రత్యేక పూజలు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.

వాస్తవానికి చాలామంది అభిమానులు మోహన్‌లాల్‌ తీరును ప్రశంసించారు. కాని కొంతమంది ముస్లిం ఛాందసవాదులు తమ మత ఆచారాలను మోహన్‌లాల్‌ అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేయడం విస్తుగొల్పుతుంది. అయితే తనపై వస్తున్న విమర్శలపై మోహన్‌లాల్‌ అసహనం వ్యక్తం చేశారు. మమ్ముట్టి తనకు ఆప్తమిత్రుడని , అలాంటప్పుడు ఆయన ఆరోగ్యం కోసం పూజలు చేస్తే ఎలా తప్పు అవుతుందని ప్రశ్నించారు. మమ్ముట్టి అనారోగ్యం నుంచి వేగంగా కోలుకుంటున్నారని తెలిపారు.