
346views
జపాన్ లో యూనిఫికేషన్ చర్చిని మూసివేయాలని టోక్యో కోర్టు తీర్పు ఇచ్చింది. 2022లో జరిగిన జపాన్ మాజీ ప్రధానమంత్రి షింజో అబె హత్యపై దర్యాప్తును పురస్కరించుకుని విద్యా శాఖ విజ్ఞప్తిపై కోర్టు పై విధంగా ఆదేశించింది. యూనిఫికేషన్ చర్చి తన అనుయాయులను ఒత్తిడి చేసి మరీ విరాళాలు దండుకుంటోందని.. దీని వల్ల వారిలో భయాందోళనలు పెరిగి, వారి కుటుంబాలకు హాని కలుగుతోందని జపాన్ విద్యాశాఖ తేల్చింది. ఈ చర్చిని రద్దు చేయాలంటూ 2023లో టోక్యో కోర్టును కోరింది. యూనిఫికేషన్ చర్చి వల్ల భారీ ఆర్థిక నష్టానికి గురైన ఓ వ్యక్తి మాజీ ప్రధాని షింజో అబెను హతమార్చాడు. అబె తాత, మాజీ ప్రధాని నోబుసుకే కిషి యూనిఫికేషన్ చర్చికి చట్ట పరమైన గుర్తింపు ఇచ్చారు. జపాన్ పాలక లిబరల్ డెమోక్రటిక్ పార్టీకీ యూనిఫికేషన్ చర్చికీ మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.




