
ఛావా సినిమా మొదలైనప్పటి నుంచి చివరిదాకా హైందవీ స్వరాజ్యం కోసం ఛత్రపతి శంభాజీ మహా రాజ్ సాగించిన అలుపెరుగని పోరాటం వీక్షకులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తోంది. దేశాన్ని సర్వనాశనం చేసిన ఇస్లాం చొరబాటుదారులలో యావత్ హిందూ బంధువులు గర్వించడానికి, ఆత్మగౌరవాన్ని రక్షించు కోవడానికి చేయాల్సిన పోరాటం ఇదే కదా అనే భావనను సినిమా హాళ్లలో ఉన్న అబాలగోపాలానికి ‘ఛావా’ కలిగిస్తోంది.

హిందూ ధర్మ రక్షణ కోసం పోరాడిన ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడైన ఛత్రపతి శంభాజీ మహారాజ్ వీర గాధ ఆధారంగా తెరకెక్కిన “ఛావా” సినిమా తెలుగు అనువాదం చిత్రాన్ని నేటి యువతకి తెలిసి విధంగా స్వరాజ్య స్ఫూర్తి నింపాలనే లక్ష్యంతో 20వ తేది మార్చి నెలలో ప్రకాశం జిల్లా పామూరు గ్రామంలో D.T.S K.B. ధియేటర్ లో స్థానిక సేవాభారతి, భజరంగ్ ధళ్ మరియు శివాజీ యూత్ సహకారంతో ఉచితంగా 4 ప్రదర్శనలు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో దాదాపుగా 1800 పైగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సరస్వతి శిశు మందిర్ పామూరు, సిద్ధార్థ స్కూల్ దుత్తలూరు, స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల మరియు కళాశాల విద్యార్థులు, ఆర్య మరాఠీ వర్గం మరియు వ్యాపార వర్గాల వారు పాల్గొన్నారు. ఇందులో భాగంగా విద్యార్థులు ఉదయం 10.00లకు ఆర్టిసి డిపో నుంచి సినిమా హాల్ వరకు ర్యాలీని నిర్వహించారు.ఈ ర్యాలీలో విద్యార్థులకు పానీయాలు, బిస్కట్ ప్యాకెట్లును పాబోలు ఏజెన్సీస్ వారు అందించారు.

సినిమా ప్రదర్శించిన థియేటర్ లో శంభాజీ మహారాజ్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. సినిమా ప్రదర్శన సమయంలో గుమ్మడి కాయతో దిష్ఠి తీసి హారతి ఇచ్చి ప్రజలు ఈ కార్యక్రమన్ని జయప్రదం చేశారు.





