News

తిరుమలలో అన్యమత వ్యాఖ్యలతో కారు

294views

తిరుపతి అలిపిరి తనిఖీ కేంద్రంలో భద్రత వైఫల్యం లోపించింది. తిరుమలకు చేరుకున్న అన్య మత వ్యాఖ్యలతో కూడిన కారు కనిపించింది. సాధారణంగా అలిపిరి తనిఖీ కేంద్రంలో అన్య మత చిహ్నాలు, రాజకీయ పార్టీలు చిహ్నాలు, ఫొటోలు అనుమతించరు. అయితే కారుపై క్రిస్టియన్ మతానికి చెందిన అన్యమత వ్యాఖ్యలు ఉన్నా.. అది తిరుమలకు చేరుకోవడంపై టిటిడి తనిఖీ భద్రతా వైఫల్యాన్ని సూచిస్తుంది. ఇకనైనా అలిపిరి తనిఖీ కేంద్రం సిబ్బంది పటిష్ట తనిఖీలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు.