
292views
గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా కార్యక్రమం వేదికగా ప్రసార భారతి తమ కొత్త స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్‌ను ఆవిష్కరించింది. ఈ ఓటీటీ ద్వారా రామాయణం, మాహాభారతాలతో పాటు రేడియో కార్యక్రమాలు, భక్తి పాటలు, ఆటలు, ఇ-బుక్స్ వంటివి సైతం ఉచితంగానే అందిస్తామని ప్రకటించింది.
ప్రసార భారతి అందుబాటులోకి తీసుకొచ్చిన తమ ఓటీటీ ‘వేవ్స్’ ద్వారా రామాయణం, మహాభారతం ధారావాహికలను ఉచితంగా అందిస్తోంది. వీటితోపాటు రేడియో కార్యక్రమాలు, భక్తి గీతాలు, ఆటలు, ఈ- పుస్తకాలను కూడా ఉచితంగా అందుబాటులోకి తీసుకొచ్చింది. వేవ్స్‌లో 65 లైవ్ ఛానళ్లు అందుబాటులో ఉంటాయనీ, 10కి పైగా విభాగాల్లో విభిన్న కార్యక్రమాలను పొందవచ్చని ప్రసారభారతి తెలిపింది.





