
257views
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం సమీపంలోని రామచంద్రాపురం(అయ్యంబొట్లపల్లె) శివాలయం చెంత ముచలిందనాగ శిలాశాసనాన్ని చారిత్రక పరిశోధకుడు తురిమెళ్ల శ్రీనివాస ప్రసాద్ గుర్తించారు. కాకతీయుల ఏలుబడిలోని మెట్టవాడ(ప్రస్తుతం వినుకొండ, త్రిపురాంతకం, పుల్లలచెరువు, వై.పాలెం ప్రాంతాలు)లోని దువ్వలి కంపణంలో గల వెల్మపల్లి(ప్రస్తుతం త్రిపురాంతకం మండలం వెల్లంపల్లె) గ్రామాన్ని అమరావతిలోని బుద్ధ దేవునికి దానం చేసినట్లు ఇందులో లిఖించి ఉంది. రుద్రమదేవి పుణ్యం కోసం కాకతీయుల సామంతులైన బొల్నాయుని మల్లికార్జున నాయంకులు ఈ గ్రామాన్ని దానం చేసినట్లు పేర్కొన్నారు. 10వ శతాబ్దం తర్వాత కూడా బౌద్ధ మతం కొనసాగిందని చెప్పడానికి ఈ శాసనం ఆధారంగా నిలుస్తోందని పురావస్తుశాఖ డైరెక్టర్ మునిరత్నంరెడ్డి తెలిపారు.





